క్రీడాభూమి

రోహిత్‌తో సుదీర్ఘ ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: రోహిత్ శర్మతో కలిసి తన ప్రయాణం సుదీర్ఘకాలం సాగుతుందని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ బయలుదేరుతున్న సందర్భంగా అతను ఆదివారం ఇక్కడ ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఎక్కువ కాలం టీమిండియాకు ఓపెనర్లుగా వ్యవహరించారని, వారి మాదిరిగానే తాను, రోహిత్ కూడా భారత్‌కు సేవలు అందిస్తామన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నానని, పరుగులు రాబట్టడం ఎంతో సంతోషంగా ఉందని ధావన్ చెప్పాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తానని అన్నాడు. వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించడమే తన లక్ష్యమని, క్రీజ్‌లో పాతుకుపోయే తత్వం తనకు లేదని ధావన్ స్పష్టం చేశాడు. అలాంటి బ్యాటింగ్‌నే తాను ఇష్టపడతానని అన్నాడు. ఆసియా చాంపియన్‌షిప్, ఆతర్వాత స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ పోటీల్లో గొప్పగా రాణిస్తామన్నాడు.
పునరాగమనమే కష్టం: నెహ్రా
జాతీయ జట్టులో అరంగేట్రం చేయడం కంటే పునరాగమనమే చాలా కష్టమని వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. 2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆడిన 37 ఏళ్ల నెహ్రా వేలికి గాయమైన కారణంగా ఫైనల్‌కు దూరమయ్యాడు. ఆతర్వాత సుమారు ఐదేళ్లపాటు అతనికి టీమిండియాలో స్థానం దక్కలేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతను చోటు సంపాదించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసియా కప్ టోర్నీకి కూడా ఎంపికైన నెహ్రా తాను మళ్లీ టీమిండియాలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని అన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రాణించేందుకు తాను ఎంతో కష్టపడ్డానని అన్నాడు. యువ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాసహా జట్టులోని యువ ఆటగాళ్ల అందరితోనూ తనకు సత్సంబంధాలున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
ప్రమాదం తప్పింది!
క్రైస్ట్‌చర్చి, ఫిబ్రవరి 21: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు ప్రమాదం తప్పింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ వేసిన బంతి వేగంగా వచ్చి స్మిత్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీనితో మైదానంలో స్మిత్ కుప్పకూలాడు. కొంత సేపు అతను కదలకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లతోపాటు న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఆందోళన చెందారు. అయితే, కొద్ది సేపటి తర్వాత స్మిత్ లేచి నిలబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 15 నెలల క్రితం సీన్ అబోట్ వేసిన బౌన్సర్‌ను పుల్‌షాట్‌గా కొట్టేందుకు ప్రయత్నించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ బంతి బలంగా తగలడంతో మైదానంలో కుప్పకూలాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందిన సంఘటనను ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకా మరచిపోలేదు. స్మిత్ కూడా బంతి తగిలి అక్కడే పడిపోవడంతో సహజంగానే ఆసీస్ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది. వేగవంతమైన బంతిని వేసిన వాగ్నర్‌లోనూ భయం స్పష్టంగా కనిపించింది. అతను నేరుగా స్మిత్ వద్దకు వెళ్లి, అతను నిలబడే వరకూ అక్కడే నిల్చున్నాడు. బ్యాట్స్‌మన్ గాయపడాలన్న ఉద్దేశంతో ఎవరూ బంతులు వేయరని, ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని అతను వ్యాఖ్యానించాడు. స్మిత్‌కు ప్రమాదం తప్పినందుకు ఎంతో సంతోషంగా ఉందని వాగ్నర్ అన్నాడు.