క్రీడాభూమి

జైపూర్ రోడ్డుపై బుమ్రా ఫొటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 24: జైపూర్ రోడ్డుపై భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫొటోతో ఉన్న భారీ బోర్డు అందరినీ ఆకట్టుకుంటున్నది. అయితే, దీని ఏర్పాటుపై బుమ్రా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంటూ, సిగ్నల్ వద్ద గీత దాటవద్దని జైపూర్ పోలీస్ శాఖ ఒక భారీ బోర్డును ఏర్పాటు చేసింది. దానిపై బుమ్రా నోబాల్ వేసినప్పటి ఫొటో ఉండడమే వివాదానికి కారణమైంది. అతని కాలు గీతను దాటడానికీ, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జంప్ చేయవద్దని సూచించడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో జైపూర్ పోలీసులకే తెలియాలి. బుమ్రా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ, నోబాల్‌ను ఉద్దేశపూర్వకంగా వేయమని, ఒక్కోసారి పొరపాటున జరుగుతుందని వాపోయాడు. తన ఫొటోను ఈ విధంగా వాడుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. నోబాల్ వేసినంత మాత్రాన ఇంతగా పరువు తీయాలా అంటూ బాధపడుతున్నాడు. వివాదంగా మారుతున్న బోర్డును జైపూర్ పోలీస్ శాఖ తొలగిస్తుందో లేక అందరూ చూస్తారంటూ దానిని అక్కడే ఉంచుతుందో వేచిచూడాలి.