క్రీడాభూమి

ఆగస్టు 5న జుల్పికర్‌తో విజేందర్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: ఒలింపిక్ కాంస్యపతక విజేత, ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్ ఆగస్టు5న చైనాకు చెందిన జుల్పికర్ మైమైతాలితో తలపడతాడు. ప్రస్తుతం డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ చాంపియన్ అయిన విజేందర్ డబ్ల్యుబిఓ ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్ అయిన జుల్పికర్‌ను ముంబయి శివారు వర్లిలోని ఎన్‌ఎస్‌సిఐ స్టేడియంలో ఢీకొంటాడని మంగళవారం ఇక్కడ విజేందర్ సమక్షంలో పోటీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీలో ఇద్దరు కూడా తమ డబ్ల్యుబిఓ టైటిళ్లను పణంగా పెడుతున్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా వారు తమ టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడంతో పాటుగా ఎదుటి వాడి టైటిల్‌ను కూడా దక్కించుకుంటాడని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీకోసం విజేందర్ కొంతకాలంగా ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో శిక్షణ పొందుతున్నాడు. కాగా, ఈ పోటీకి సంబంధించిన తొలి టికెట్‌ను అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్‌కు ఆయన నివాసంలో అందజేశాడు. తన దృష్టిలో జుల్పికర్ పసి కూనని విజేందర్ అంటూ, అతను తనను కిందపడేస్తానని చెబితే నవ్వొచ్చిందన్నాడు.