క్రీడాభూమి

లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీం కోర్టుకు ఎంసిఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశంలో క్రికెట్ రంగాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సిద్ధంగా లేదు. ఈ సిఫార్సులను వెంటనే అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఇటీవలే సూచించగా, వాటిలోని కొన్ని అంశాలు ఆరచణ యోగ్యంగా లేవని శరద్ పవార్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఎంసిఎ వాదిస్తున్నది. క్రికెట్ సంఘాలు, సమాఖ్యల్లో కార్యవర్గ సభ్యులకు వయోపరిమితిని ఖాయం చేయాలని, వరుసగా రెండుసార్లు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే ఎక్కువ సమయంలో కార్యవర్గంలో ఉండరాదని లోధా కమిటీ సిఫార్సు చేసింది. అంతేగాక, బెట్టింగ్‌కు చట్టబద్ధతను కల్పించాలని సూచించింది. మంత్రులకు క్రికెట్ సంఘాలు, సమాఖ్యలతో సంబంధం ఉండరాదని స్పష్టం చేసింది. కాగా, ఈ సిఫార్సులను అమలు చేస్తే, చాలా మంది తమ అధికారాన్ని కోల్పోతారు. ఎంసిఎకు చీఫ్‌గా వ్యవహరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ కూడా పదవి నుంచి వైదొలగాల్సి వస్తుంది. అతని వయసు 75 సంవత్సరాలు. లోధా కమిటీ చేసిన ప్రతిపాదన మేరకు 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరూ క్రికెట్ సంఘాల్లో ఉండకూడదు. దీనితో పదవి కోల్పోయే ప్రమాదంలో పడిన శరద్ పవార్ సుప్రీం కోర్టులో లోధా కమిటీ సిఫార్సులను సవాలు చేయాలని నిర్ణయించాడు. పలు అంశాలు ఆచరణ సాధ్యం కాదని, వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టులో వేసిన పటిషన్‌లో ఎంసిఎ పేర్కొంది.