క్రీడాభూమి

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. అంతేగాక, టెస్టు ఫార్మెట్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 135 పరుగులు వెనుకంజలో ఉన్న కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, మ్యాచ్ మూడో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసంది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఉదయం ఆటను కొనసాగించి 111.1 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్‌సన్ 97 పరుగులు చేసి, మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే, న్యూజిలాండ్ జట్టును ఆదుకోవడానికి అతని శక్తవంచన లేకుండా ప్రయత్నించాడు. కోరి ఆండర్సన్ 40, వాల్టింగ్ 46 పరుగులు సాధించగా, చివరిలో మాట్ హెన్రీ వీరోచిత పోరాటాన్ని కొనసాగించి 66 పరుగులు సాధించాడు. అయితే, వీరి కృషి విఫలంకాగా, రెండో ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ తన ప్రత్యర్థి ముందు 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
131 పరుగుల దూరం..
చివరిదైన రెండో టెస్టుకూడా గెల్చుకోవడానికి ఆస్ట్రేలియా ఇంకా 131 పరుగుల దూరంలో ఉంది. 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 22 పరుగులు చేసి వాగ్నర్ బౌలింగ్‌లో వాల్టింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్ జో బర్న్స్ 27, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉండగా, ఆస్ట్రేలియా విజయానికి ఆస్ట్రేలియా ఇంకా 131 పరుగులు చేయాలి. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో ఆలౌట్ 370 ఆలౌట్ (బ్రెండన్ మెక్‌కలమ్ 145, కోరీ ఆండర్సన్ 72, వాట్లింగ్ 58, నాథన్ లియాన్ 3/61).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 363): 153.1 ఓవర్లలో 505 ఆలౌట్ (జో బర్న్స్ 170, స్టీవెన్ స్మిత్ 138, ఆడం వోగ్స్ 60, నాథన్ లియాన్ 33, నీల్ వాగ్నర్ 6/106, ట్రెంట్ బౌల్ట్ 2/108).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 111.1 ఓవర్లలో 335 ఆలౌట్ (లాథమ్ 39, కేన్ విలియమ్‌సన్ 97, వాల్టింగ్ 46, హెన్రీ 66, జేమ్స్ పాటిన్సన్ 4/277, బర్డ్ 5/59).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 70 (జో బర్న్స్ 27 నాటౌట్, ఉస్మాన్ ఖాజా 19 నాటౌట్).

రికార్డుల విలియమ్‌సన్
క్రైస్ట్‌చర్చి: కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్‌సన్ పలు రికార్డులను నెలకొల్పాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 4,000 పరుగుల మైలురాయిని చేరిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. మార్టిన్ క్రో 24 సంవత్సరాల క్రితం తన 93వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధిస్తే, విలియమ్‌సన్ 89వ ఇన్నింగ్స్‌లోనే ఆ మైలురాయిని చేరాడు. రాస్ టేలర్ (94 ఇన్నింగ్స్)లో 4,000 టెస్టు పరుగులను పూర్తి చేశాడు. వీరిద్దరి కంటే వేగంగా ఈ ఘనతను సాధించిన న్యూజిలాండ్ క్రికెటర్‌గా విలియమ్‌సన్ రికార్డు పుస్తకాల్లో చేరింది. కాగా, మహేల జయవర్ధనే (91 ఇన్నింగ్స్), కుమార సంగక్కర (92 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (96 ఇన్నింగ్స్) కంటే విలియమ్‌సన్ తొందరగా నాలుగు వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. కాగా, టెస్టుల్లో ఈ మైలురాయిని చేరిన పిన్న వయస్కుడిగానూ విలియమ్‌సన్ పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. మార్టిన్ క్రో రికార్డును అతను తిరగరాశాడు. గత ఏడాది ఐదు శతకాల సాయంతో, 90.15 సగటుతో అతను 1,172 టెస్టు పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ గొప్ప బ్యాట్స్‌మెన్ జాబితాలో స్థానం సంపాదించాడు.