క్రీడాభూమి

హోరాహోరీలో ఓడిన ఆసీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్, జూలై 9: చివరి క్షణం వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా ఓటమిపాలుకాగా, ఇంగ్లాండ్ 3 ప రుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు నమోదు చేయ గా, ఆసీస్ 8 వికెట్లు కోల్పోయ 256 పరుగుల వద్ద పరిమితమైంది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌లో టామీ బ్యూ వౌంట్ 49, కాథెరిన్ బ్రంట్ 45 (నా టౌట్), సారా టేలర్ 35, జెన్నీ గన్ 39 పరుగులతో రాణిం చారు. ఆసీస్ బౌలర్లు ఏకంగా 32 పరుగులను ఎక్‌స్ట్రాలుగా సమ ర్పించుకుంది. ఇంగ్లాండ్‌ను ఓడించి, తన ఆధిపత్యాన్ని కొనసా గించేందుకు 260 పరుగులు సాధించాల్సి ఉండగా, ఎలీస్ పెర్రీ (70), మెగ్ లానంగ్ (40) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేక పోవడంతో ఆస్ట్రేలియా మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని చ విచూసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కాథెరిన్ బ్రంట్, అలెక్స్ హార్టీ, జెన్నీ గన్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.