క్రీడాభూమి

సంప్రదాయక దుస్తుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: వింబుల్డన్‌లో పాల్గొనే వారంతా సంప్రదాయంగా వస్తున్న తెల్లటి దుస్తులనే ధరించాలి. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోగానే, మిగతా ఏ టోర్నీలోనూ కనిపించని డ్రెస్ కోడ్‌ను వింబుల్డన్‌లో తప్పనిసరిగా పాటిస్తున్నారు. దుస్తులే కాదు.. చివరికి బూట్లు కూడా తెల్లనివే వేసుకోవాలి. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారికి అంపైర్లు ముందుగా జరిగిన పొరపాటును సూచిస్తారు. మార్పు రాకపోతే, చర్యలు తీసుకుంటారు. 2013లో రోజర్ పెదరర్ తెల్ల బూట్లే వేసుకున్నప్పటికీ, వాటి అడుగున సోల్ నారింజ రంగులో ఉంది. దీనిని గమనించిన అంపైర్ అతనిని పిలిచి, తర్వాతి మ్యాచ్‌లో అడుగు భాగం కూడా తెల్లగా ఉండే బూట్లు వేసుకోవాలని సూచించాడు. కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫెదరర్‌కే హెచ్చరిక జారీ చేవారంటే, వింబుల్డన్‌లో డ్రెస్ కోడ్‌ను ఎంత ఖచ్చితంగా అమలు చేస్తారో ఊహించడం కష్టం కాదు. అండ్రీ అగస్సీ తెల్ల దుస్తులను వేసుకోవడానికి నిరాకరించిన కారణంగా 1988 నుంచి 1990 వరకూ వింబుల్డన్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. తెల్ల డ్రెస్సు వేసుకోవాలన్న నిబంధనను మార్చాలని అతను చేసిన సూచనను నిర్వాహకులు తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రెస్ కోడ్‌ను మార్చేది లేదని నిర్వాహకులు తేల్చిచెప్పారు. మిగతా టోర్నీల్లో మాదిరిగానే తమకు ఇష్టమైన దుస్తులు వేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా కొంత మంది ఆటగాళ్లు కోరుతున్నప్పటికీ నిర్వాహకులు ఏ మాత్రం స్పందించడం లేదు. ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదని తేల్చిచెప్తున్నారు. సంప్రదాయాన్ని సజీవంగా నిలబెడుతున్న వింబుల్డన్ నిర్వాహకులు ప్రశంసలకు అర్హులు.
తింటూ.. తాగుతూ..
వింబుల్డన్ టోర్నమెంట్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల్లో ఎక్కువ మంది భారీ పరిమాణంలో తినేస్తుంటారు. మంచి నీరేకాదు.. బీరు బాటిళ్లను కూడా ఖాళీ చేస్తుంటారు. ఈ టోర్నీ సందర్భంగా సుమారు 27,000 కిలోల స్ట్రాబెర్రీలు అమ్ముడవుతాయి. 7,000 లీటర్ల ఐస్ క్రీమ్‌ను ప్రేక్షకులు లొట్టలేసుకుంటూ తినేస్తారు. 3,30,000 కప్పుల టీ, కాఫీ, 2,34,000 ప్లేట్ల భోజనం, 2,30,000 మంచి నీళ్ల సీసాలు, 1,10,000 పింట్ల బీరు, 76,000 సాండ్‌విచ్‌లు, 44,000 లీటర్ల పాలు అమ్ముడవుతాయి. కనీసం 30,000 పిజ్జాలను స్వాహా చేస్తారు. 29,000 బాటిళ్ల చాంపైన్, 16,000 ఫిష్ చిప్స్, 10,000 కప్‌ల యోగట్ (పెరుగు), 5,000 కిలోల బరువు తూగే అరటి పండ్లను ప్రేక్షకులు ఆరగించేస్తారు. ఇవన్నీ చూస్తుంటే, వారు మ్యాచ్‌లు చూస్తారా లేక తినడంలోనే బిజీగా ఉంటారా అన్న అనుమానం తలెత్తక మానదు.