క్రీడాభూమి

నేటి నుంచి ఆసియా కప్ క్రికెట్ తొలి పరీక్షకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా కప్ చాంపియన్‌షిప్ బుధవారం నుంచి మొదలుకానుండగా, తొలి మొదటి మ్యాచ్‌కి భారత్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ ఒకవేళ మైదానంలోకి దిగలేకపోతే, అతని స్థానంలో జట్టుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వం వహించే అవకాశం ఉంది. వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించిన టీమిండియా అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు లభించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో పటిష్టంగా ఉన్న భారత్ కాగితంపై చూస్తే ఫేవరిట్ ముద్ర వేయించుకుంటుంది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకూ ప్రతి మ్యాచ్‌నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోరాడకపోతే, ప్రతికూల ఫలితాలను ఎదుర్కోక తప్పదు.
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఫస్ట్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ దిగుతాడు. టి-20 స్పెషలిస్టుగా ముద్ర వేయించుకున్న సురేష్ రైనా, యువరాజ్ సింగ్‌లతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఫోర్త్ లేదా ఫిఫ్త్ డౌన్‌లో ధోనీ బ్యాటింగ్‌కు దిగుతాడు. ఒకవేళ అతను ఫిట్నెస్ సమస్యతో బ్యాటింగ్‌కు రాకపోతే, ఇప్పటికే బ్యాకింగ్‌గా ఎంపిక చేసిన పార్థీవ్ పటేల్‌కు వికెట్‌కీపర్‌గాగాక, టాప్ ఆర్డర్‌లో దిగే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్‌గానూ మంచి పేరుంది. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమైనా, అతనిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రవీంద్ర జడేజా, హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్య కూడా పరుగులు రాబట్టగల సమర్థులే. రవిచంద్రన్ అశ్విన్, ఆసిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా భారత లైనప్‌ను పూర్తి చేస్తారు. అయితే టెయిలెండర్ల వరకూ బ్యాటింగ్ రాకపోవచ్చు.
అశ్విన్ సూపర్ ఫామ్
స్టార్ స్పిన్నర్ అశ్విన్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి, తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. విశాఖపట్నంలో జరిగిన కీలకమైన చివరి మ్యాచ్‌లో కేవలం ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, టి-20 కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణను నమోదు చేశాడు. మొత్తం మీద గత ఆరు టి-20 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టిన అశ్విన్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ముస్త్ఫాజుర్‌పైనే భారం
బంగ్లాదేశ్ విషయానికి వస్తే, ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ముస్త్ఫాజుర్ రహ్మాన్ సామర్థ్యంపైనే ఆధారపడి బరిలోకి దిగనుంది. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటించినప్పుడు ముస్త్ఫాజుర్ వైవిధ్యభరితమైన బంతులతో ఆకట్టుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపాడు. స్వదేశంలో జరుగుతున్న ఆసియా కప్‌లో అతను పిచ్ తీరును బాగా ఉపయోగించుకొని చెలరేగిపోతాడని బంగ్లాదేశ్ అభిమానులు ఆశిస్తున్నారు. తస్కిన్ అహ్మద్, అల్ అమీర్ హొస్సేన్‌తోనూ భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవని భావిస్తున్నారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అండ కూడా బంగ్లాదేశ్‌కు ఉంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ సౌమ్య సర్కార్, వరల్డ్ కప్ హీరో మహమ్మదుల్లా తదితరులతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే కనిపిస్తున్నది. మొత్తం మీద భారత్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీపై తనదైన ముద్ర వేయాలని బంగ్లాదేశ్ ఆశిస్తున్నది. ఇలావుంటే, ముస్తాఫిజుర్‌ను ఎదుర్కోవ డం ఎవరికీ అనుకున్నంత సులభం కాదని బంగ్లా దేశ్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా అన్నాడు. మంగళవా రం అతను విలేఖరులతో మాట్లాడుతూ ముస్తాఫి జుర్‌ను సమర్థంగా ఎదుర్కోవలన్న తాపత్రయంతో ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఫలితం ఉండదని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ బుధవారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది.

ప్రాక్టీస్‌కు ధోనీ డుమ్మా

మీర్పూర్: బంగ్లాదేశ్‌తో బుధవారం మ్యాచ్ జరగనుండగా, మంగళవారం నాటి ప్రాక్టీస్ సెషన్‌కు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరయ్యాడు. కండరాలు బెణకడంతో బాధపడుతున్న అతను నెట్స్‌కు రాకపోవడంతో, తొలి మ్యాచ్‌కి అతను సిద్ధంగా ఉంటాడా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, ధోనీ మ్యాచ్‌లో ఆడే విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి వీల్లేదని జట్టు వర్గాలు అంటున్నాయి. మ్యాచ్‌కి ముందు అతని పరిస్థితిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఈ వర్గాలు తెలిపాయి.

ఢాకాలో మంగళవారం జరిగిన ఆసియా కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో టోర్నీ అధికారులతో కలిసి పాల్గొన్న లసిత్ మలింగ (శ్రీలంక), అంజద్ జావేద్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), మహేంద్ర సింగ్ ధోనీ (్భరత్), మష్రాఫ్ మొర్తాజా (బంగ్లాదేశ్)