క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఫైనల్‌కు ముగురుజా, వీనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో స్పెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 14వ ర్యాంకర్ గార్బినె ముగురుజా, 11వ స్థానంలో ఉన్న వీనస్ విలియమ్స్ ఫైనల్ చేరారు. టైటిల్ కోసం వీరి మధ్య శనివారం తుది పోరాటం జరుగుతుంది. గురువారం జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో ముగురుజా 6-1, 6-1 ఆధిక్యంతో స్లొవేకియాకు చెందిన ప్రస్తుత 87వ ర్యాంక్ క్రీడాకారిణి మగ్దలీన రిబరికోవాను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణం నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడిన ముగురుజా చివరి వరకూ అదే జోరును కొనసాగించింది. కెరీర్‌లో రెండోసారి ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 2015లోనూ ఆమె ఈ టోర్నీలో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ అందుకోలేకపోయింది. ఈసారి ఆమెను అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. నిరుడు ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించింది. మరో టైటిల్‌పై ఇప్పుడు కనే్నసింది. ఇలావుంటే, రిబరికోవా తన కెరీర్‌లో మొట్టమొదటిసారి గ్రాండ్ శ్లామ్ సెమీస్ కూడా చేరలేదు. గతంలో ఆమె ఏ గ్రాండ్ శ్లామ్‌లోనూ మూడో రౌండ్ దాటలేదు. 2008, 2009 సంవత్సరాల్లో యుఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడమే ఇంత వరకూ ఆమె అత్యుత్తమ ప్రదర్శన. వింబుల్డన్‌లో సెమీస్ వరకూ చేరి, తన సత్తా నిరూపించుకుంది.
రెండో సెమీ ఫైనల్‌లో ఆమెరికా స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ తన ప్రత్యర్థి జొహన్నా కొన్టాను 6-4, 6-2 తేడాతో ఓడించింది. కెరర్‌లో ఇంతకు ముందు ఐదు పర్యాయాలు వింబుల్డన్ విజేతగా నిలిచిన ఆమె మరోసారి టైటిల్‌ను ఆశిస్తున్నది. కాగా, కొన్టా ఒక గ్రాండ్ శ్లామ్‌లో సెమీస్ వరకూ చేరడం ఇది రెండసారి. నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, ఫైనల్ చేరలేకపోయింది. ఇప్పుడు వింబుల్డన్‌లో అదే పరిస్థితి ఎదురైంది.
ఇలావుంటే, సెంటర్ కోర్టులో 15న మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయి. 16న పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఈవెంట్స్‌లో టైటిల్ పోరాటాలు ఉంటాయి.

చిత్రాలు.. గార్బినె ముగురుజా *వీనస్ విలియమ్స్