క్రీడాభూమి

కెనడా ఓపెన్ బాడ్మింటన్‌లో మిశ్రమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్గరీ, జూలై 14: కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు మను అత్రి, బి.సుమిత్ రెడ్డి పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రెండో సీడ్ జోడీగా బరిలోకి దిగిన ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీ రెడ్డి కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన మను అత్రి, సుమిత్ రెడ్డి 45 నిమిషాల పాటు సాగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్ పోరులో 21-17, 17-21, 21-13 గేముల తేడాతో కొరియాకు చెందిన చోయ్ సోల్‌గ్యు, జే హ్వాన్ కిమ్ జోడీపై విజయం సాధించారు. సెమీస్ బెర్తు కోసం మను, సుమిత్ కొరియాకే చెందిన కిమ్ వోన్, సెయుంగ్ జే సియో జోడీతో తలపడనున్నారు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో 21-11, 21-17 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన రాబిన్ టబెలింగ్, చెరిల్ సియినెన్ జోడీని మట్టికరిపించిన ప్రణవ్, సిక్కీరెడ్డి క్వార్టర్ ఫైనల్‌లో కొరియాకు చెందిన కిమ్ వోన్ హో, షిన్ సెయుంగ్ చాన్ జోడీతో తలపడనున్నారు. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌తో పాటు హెచ్‌ఎస్.ప్రణయ్, అభిషేక్ యెలెగర్ రెండో రౌండ్‌లోనే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను నిరాశపర్చింది. కామనె్వల్త్ క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన కశ్యప్ 10-21, 21-10, 15-21 తేడాతో వటనాబే చేతిలో ఓటమిపాలవగా, రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణయ్ 21-17, 14-21, 13-21 తేడాతో తొమ్మిదో సీడ్ ఆటగాడు జియాన్ హెయోక్ జిన్ (కొరియా) చేతిలోనూ, అభిషేక్ 15-21, 23-12, 14-21 తేడాతో ఐదో సీడ్ ఆటగాడు పాబ్లో అబియాన్ (స్పెయిన్) చేతిలోనూ పరాజయాలను ఎదుర్కొన్నారు. అలాగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో గద్దే రుత్విక శివానీ 13-21, 21-17, 19-21 తేడాతో జపాన్‌కు చెందిన రెండో సీడ్ క్రీడాకారిణి అయా ఒహోరీ చేతిలోనూ, నేషనల్ చాంపియన్ రీతూపర్ణా దాస్ 21-9, 18-21, 16-21 తేడాతో హరుకో సుజుకీ (జపాన్) చేతిలో ఓటమిపాలవగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తరుణ్ కోన, జక్కంపూడి మేఘన 9-21, 8-21 గేముల తేడాతో కొహెయి గోండో, వకానా నగహరా జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు.