క్రీడాభూమి

అండర్-18 ప్రపంచ అథ్లెటిక్స్‌లో దనీత్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబీ, జూలై 14: కెన్యా రాజధాని నైరోబీలో జరుగుతున్న అండర్-18 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ బాలుర హ్యామర్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు చెందిన దనీత్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు మూడు రోజుల తర్వాత గురువారం తొలి పతకం లభించింది. తొలి ప్రయత్నంలో దనీత్ సింగ్ హ్యామర్‌ను 74.20 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో ఈ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో ఉక్రెయిన్‌కు చెందిన మిఖైలో కొఖన్ (82.31 మీటర్లు) పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, జర్మన్ అథ్లెట్ రపాయెల్ వింకెల్వోస్ (71.78 మీటర్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో మన దేశానికి ప్రాతినిథ్యం వహించిన మరో అథ్లెట్ నితేష్ పూనియా 65.79 మీటర్ల దూరం హ్యామర్‌ను విసిరి పదో స్థానంలో నిలిచాడు. ఐదు రోజుల పాటు జరిగే ఈ చాంపియన్‌షిప్స్‌లో మన దేశానికి మొత్తం 19 మంది అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.