క్రీడాభూమి

మిథాలీ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూలై 15: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌ని భారత్ సొంతం చేసుకొని, సెమీ ఫైనల్లో చోటు దక్కించుకుంది. గెలిస్తేగానీ టోర్నీలో నిలిచే అవకాశం లేని అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రత్యర్థి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్ అండగా నిలిచింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజృంభించిన ఆమె శతకాన్ని నమోదు చేయడంతో భారత్ ఏడు వికెట్లకు 265 పరుగులు సాధించగలిగింది. అనంతరం ప్రత్యర్థిని 25.3 ఓవర్లలో 79 పరుగులకే కట్టడి చేసింది. రాజేశ్వరి గైక్వాడ్ కేవలం 15 పరుగులిచ్చి, ఐదు వికెట్లు కూల్చడం ద్వారా భారత్‌కు 186 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత ఇన్నింగ్స్‌ను స్మృతి మందానా, పూనమ్ రావత్ ప్రారంభించారు. జట్టు స్కోరు 10 పరుల వద్ద పూనమ్ వికెట్ కూలింది. 11 బంతులు ఎదుర్కొని, కేవలం నాలుగు పరుగులు చేసిన ఆమెను కాటీ మార్టిన్ క్యాచ్ పట్టగా లీ తహుహు అవుట్ చేసింది. మరో 11 పరుగులకే మందానా కూడా పెవిలియన్ చేరింది. ఆమె 24 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి హనా రోవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అదుకునే బాధ్యతను హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మిథాలీ తీసుకుంది. వీరిద్దరూ కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, స్కోరుబోర్డును ముందుకు దూకించారు. 90 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ 7 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరింది. మిథాలీతో కలిసి మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించిన ఆమె లీ కాస్పరెక్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. స్టార్ బ్యాట్స్‌మన్ దీప్తి శర్మ ఏడు బంతులు ఎదుర్కొన్నప్పటికీ, పరుగుల ఖాతా తెరవలేక, హనా రోవ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రాచెల్ ప్రీస్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన వేదా కృష్ణమూర్తి సహకారంతో మిథాలీ తన విజృంభణను కొనసాగించింది. ఐదో వికెట్‌కు 108 పరుగులను జత కలిపిన తర్వాత, 109 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లీ కాస్పరెట్ బౌలింగ్‌లో అమీ సాటర్త్‌వెయిట్ క్యాచ్ అందుకోగా మిథాలీ వెనుదిరిగింది. 123 బంతులు ఎదుర్కొన్న ఆమె స్కోరులో 11 బౌండరీలు ఉన్నాయి. ఇన్నింగ్స్‌కు అదే చివరి ఓవర్. మిథాలీ మూడో బంతిలో అవుట్‌కాగా, ఐదో బంతికి వేదా కృష్ణమూర్తి (45 బంతుల్లో 70) రనౌటైంది. చివరి బంతిలో శిఖా పాండే (0) వికెట్ కూలింది. ఆమె ఇచ్చిన క్యాచ్‌ని అమీ సాటర్త్‌వెయిట్ ఎలాంటి పొరపాటు లేకుండా అందుకుంది. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు సాధించింది. లీ కాస్పరెట్ 45 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, హనా రోవ్ 30 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. లీ తహుహుకు ఒక వికెట్ లభించింది.
కివీస్ తడబాటు
ప్రమాదకరమైన భారత్‌ను సెమీస్ చేరకుండా అడ్డుకునేందుకు 266 పరుగులు సాధించాల్సి ఉండగా, న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబడింది. జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కెప్టెన్ సూజీ బేట్స్ రూపంలో చేజార్చుకుంది. ఆమె కేవలం ఒక పరుగు చేసి, శిఖా పాండే బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి చిక్కింది. మరో రెండు పరుగులకే కివీస్ రెండో వికెట్ కూడా కూలింది. రాచెల్ ప్రీస్ట్ (5)ను ఝూలన్ గోస్వామి రిటర్న్ క్యాచ్ అందుకొని పెవిలియన్‌కు పంపింది. వరుసగా రెండు వికెట్లు కూలడంతో కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ఆతర్వాత కోలుకోలేకపోయింది. అమీ సాటర్త్‌వెయిట్ (26) కాటీ మార్టిన్ (12), అమెలియా కెర్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారంటే, మిగతా వారు ఎంత దారుణంగా విఫలమయ్యారో స్పష్టమవుతుంది. భారత బౌలింగ్‌ను, ప్రత్యేకించి రాజేశ్వరిని ఎదుర్కోలేకపోయిన కివీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. 7.3 ఓవర్లు బౌల్ చేసిన రాజేశ్వరి 15 పరుగులు మాత్రమే ఇచ్చి, ఐదు వికెట్లు సాధించింది. పీన్తి శర్మ 26 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది.
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: స్మృతి మందానా బి హనా రోవ్ 13, పూనమ్ రావత్ సి కాటీ మార్టిన్ బి లీ తహుహు 4, మిథాలీ రాజ్ సి అమీ సాటర్త్‌వెయిట్ బి లీ కాస్పరెక్ 109, హర్మన్‌ప్రీత్ కౌర్ సి అండ్ బి లీ కాస్పరెక్ 60, దీప్తి శర్మ సి రాచెల్ ప్రీస్ట్ బి హనా రోవ్ 0, వేదా కృష్ణమూర్తి రనౌట్ 70, సుష్మా వర్మ 0 నాటౌట్, శిఖా పాండే సి అమీ సాటర్త్‌వెయిట్ బి లీ కాస్పరెట్ 0, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 265.
వికెట్ల పతనం: 1-10, 2-21, 3-153, 4-154, 5-263, 6-265, 7-265.
బౌలింగ్: లీ కాస్పరెట్ 10-3-45-3, లీ తహుహు 10-1-49-1, హనా రోవ్ 10-3-30-2, సూజీ బేట్స్ 8-0-59-0, అమెలియా కెర్ 10-0-64-0, అమీ సాటర్త్‌వెయిట్ 2-0-15-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సుజీ బేట్స్ సి వేదా కృష్ణమూర్తి బి శిఖా పాండే 1, రాచెల్ ప్రీస్ట్ సి అండ్ బి ఝూలన్ గోస్వామి 5, అమీ సాటర్త్‌వెయిట్ స్టంప్డ్ సుష్మా వర్మ, బి రాజేశ్వరి గైక్వాడ్ 26, కాటీ మార్టిన్ సి హర్మన్‌ప్రీత్ గౌర్ బి దీప్తి శర్మ 12, సోఫీ డివైన్ సి దీప్తి శర్మ బి రాజేశ్వరి గైక్వాడ్ 7, కాటీ పెర్కిన్స్ బి దీప్తి శర్మ 1, మాడీ గ్రీన్ సి ఝూలన్ గోస్వామి బి పూనమ్ యాదవ్ 5, హనా రోవ్ బి రాజేశ్వరి గైక్వాడ్, అమెలియా కెర్ 12 నాటౌట్ లీ తహుహు సి ఝూలన్ గోస్వామి బి రాజేశ్వరి గైక్వాడ్ 5, లీ కాస్పరెక్ బి రాజేశ్వరి గైక్వాడ్ 0, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (25.3 ఓవర్లలో) 79 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-5, 2-7, 3-27, 4-51, 5-52, 6-57, 7-62, 8-62, 9-67, 10-79.
బౌలింగ్: ఝూలన్ గోస్వామి 5-1-14-1, శిఖా పాండే 5-1-12-1, దీప్తి శర్మ 6-0-26-2, రాజేశ్వరి గైక్వాడ్ 7.3-1-15-5, పూనమ్ యాదవ్ 2-0-12-1.

చిత్రం.. కెరీర్‌లో ఆరో వనే్డ సెంచరీ సాధించిన మిథాలీ రాజ్