క్రీడాభూమి

సరైన నిర్ణయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ కావాలన్న తన నిర్ణయం సరైనదేనని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండ్ మెక్‌కలమ్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన రెండవ, చివరి టెస్టులో కివీస్ ఓటమిపాలుకాగా, చివరిసారి మైదానంలో కనిపించిన మెక్‌మిలన్ ముందు నడవగా, సహచరులంతా అతనిని అనుసరించారు. విన్నింగ్ షాట్ కొట్టిన ఆడం వోగ్స్, నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పరుగుపరుగున వచ్చిన మెక్‌కలమ్‌తో కరచాలనం చేశారు. మ్యాచ్‌ని తిలకించడానికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకులు కూడా లేచి నిలబడి, మెక్‌కలమ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. భార్య ఎలిసా, పిల్లలు రిలీ, మాయా వెంట నడవగా, అతను మైదానంలో కొంతసేపు నిలబడి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అనంతరం అతను మాట్లాడుతూ తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. కెరీర్‌ను ముగించడం ఎవరికైనా బాధాకరమేనని, అయితే, ఇంకా ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించడంలో అర్థం ఉండదని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ క్రికెట్ అధికారుల నుంచి సహచరుల వరకూ, కుటుంబ సభ్యుల నుంచి అభిమానుల వరకూ అందరూ తన కెరీర్‌లో భాగస్వాములయ్యారని అన్నాడు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు.
మెక్‌కలమ్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 54 బంతుల్లోనే శతకాన్ని సాధించి, ప్రపంచ రికార్డును నెలకొల్పడం విశేషం. టెస్టు క్రికెట్‌ను ఆరంభించిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒక్క మ్యాచ్‌కి కూడా దూరం కాకుండా వరుసగా 101 మ్యాచ్‌లు ఆడిన అతను ఆడం గిల్‌క్రిస్ట్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అదే విధంగా 107 సిక్సర్లు కొట్టి, 100 సిక్సర్లతో గిల్‌క్రిస్ట్ పేరుమీద ఉన్న రికార్డును బద్దలు చేశాడు. మెక్‌కలమ్ 101 టెస్టుల్లో 6,453 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 302 పరుగులు. 12 శతకాలు, 31 అర్ధ శతకాలు సాధించాడు. 107 సిక్సర్లు 776 ఫోర్లు కొట్టాడు. 198 క్యాచ్‌లు పట్టి, 11 స్టంపింగ్స్ చేశాడు. అదే విధంగా 260 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఆడిన అతను 6,053 పరుగులు సాధించాడు. 166 అతని అత్యధిక స్కోరు. ఐదు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు చేశాడు. 577 ఫోర్లు, 200 సిక్సర్లు కొట్టాడు. 262 క్యాచ్‌లు పట్టాడు. 15 స్టంపింగ్స్ చేశాడు. టి-20 ఇంటర్నేషనల్స్‌లో అతను 71 మ్యాచ్‌లు ఆడాడు. 2,140 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 123 పరుగులు. రెండు సెంచరీలు, 15 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. 199 ఫోర్లు, 91 సిక్సర్లు కొట్టాడు. 38 క్యాచ్‌లు పట్టి, 8 స్టంపింగ్స్ చేశాడు. ఈ ఫార్మెట్‌ల అత్యధిక పరుగులు, అత్యధిక శతకాలు, అత్యధిక అర్ధ శతకాలు, ఎక్కువ సిక్సర్లు, ఎక్కువ సిక్సర్లు వంటి రికార్డులన్నీ మెక్‌కలమ్ పేరుమీదే ఉన్నాయి.