క్రీడాభూమి

జొడీ టేలర్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోటిన్‌చెమ్ (నెదర్లాండ్స్), జూలై 20: మహిళల యూరోపియన్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా గ్రూప్ ‘డి’లో స్కాట్‌లాండ్‌ను ఢీకొన్న ఇంగ్లాండ్ 6-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. జొడీ టేలర్ హ్యాట్రిక్‌తో రాణించి, ఇంగ్లాండ్ విజయంలో కీలక భూమిక పోషించింది. మ్యాచ్ 10వ నిమిషంలో తొలి గోల్ చేసిన ఆమె ఆతర్వాత 26, 53 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించింది. ఎలెన్ వైట్, జొర్డాన్ నోబ్స్, టొనీ డగన్ చేసిన గోల్స్‌తో ఇంగ్లాండ్ తిరుగులేని ఆధిక్యంతో గెలిచింది.
మరో మ్యాచ్‌లో పోర్చుగల్‌పై స్పెయిన్ 2-0 ఆధిక్యంతో విజయం సాధించింది. 23వ నిమిషంలో లొసడా గోమెజ్, 42వ నిమిషంలో సాంపెడ్రో బస్టోస్ గోల్స్ చేసి, స్పెయిన్‌ను విజయపథంలో నడిపారు.