క్రీడాభూమి

మన్‌ప్రీత్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల షాట్‌పుట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన మన్‌ప్రీత్ కౌర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షలో ఆమె విఫలమైన విషయం తెలిసిందే. వరుసగా రెండు పర్యాయాలు ఆమె ‘ఎ’ శాంపిల్స్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాలను గుర్తించారు. ‘బి’ శాంపిల్స్‌ను కూడా పరీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఆమెను అన్ని రకాల పోటీల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించింది.