క్రీడాభూమి

అండర్-17 సాకర్ వరల్డ్ కప్ మూడో దశ టికెట్ల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: మన దేశంలో జరిగే అండర్-17 ప్రపంచ కప్ సాకర్ వరల్డ్ కప్ మూడో దశ టికెట్ల అమ్మకాలు శుక్రవారం మొదలయ్యాయి. మొదటి రెండు దశల్లో అమ్మకాలకు దక్కిన ఆదరణకు నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పటికే కోల్‌కతా, గౌహతి నగరాల్లో జరిగే మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడయ్యాయి. న్యూఢిల్లీలో రికార్డు స్థాయిలో లక్ష టికెట్ల అమ్మకాలు జరిగాయి. మూడో దశ టికెట్లు అక్టోబర్ వరకూ అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించినప్పటికీ, వారం, పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావచ్చని అంటున్నారు. అక్టోబర్ 6 నుంచి 28వ తేదీ వరకూ జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు ఢీ కొంటాయి. 52 మ్యాచ్‌లు జరుగుతాయి.