క్రీడాభూమి

అప్పుడెందుకు మాట్లాడలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దక్షిణాఫ్రికాలో పిచ్‌లపై వివిధ జట్లు యాభై లేదా వంద పరుగులకే ఆలౌటైనప్పుడు అక్కడి మీడియా ఎందుకు మాట్లాడలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలదీశాడు. నాగపూర్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతుండగా, సఫారీ మీడియా మొత్తం భారత్‌లో క్రీడాస్ఫూర్తి లోపించిందని ధ్వజమెత్తుతున్నది. బుధవారం విలేఖరులతో మాట్లాడిన కోహ్లీ అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, అక్కడ పిచ్‌లపై నోరు మెదపని వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, సిరీస్ గెలిచినంత మాత్రాన తుది జట్టులో మార్పులుచేర్పులు తప్పనిసరిగా చేయాలనడం సమంజసం కాదన్నాడు. జట్టు కూర్పు అనేది జయాపజయాలపైన కాకుండా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
ఆనందంగా ఉంది
హోం గ్రౌండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడడం, జట్టుకు నాయకత్వం వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు. తన క్రికెట్ జీవితం ఇక్కడి నుంచే ఆరంభమైందని గుర్తుచేసుకున్నాడు. తన తొలి రంజీ మ్యాచ్‌ని ఇదే మైదానంలో ఆడానని చెప్పాడు. భారత జట్టుకు నాయకత్వం వహిస్తూ ఇక్కడ టెస్టు ఆడడం ఒక చిరకాల జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నాడు.
ఫలితాన్ని క్యూరేటర్ నిర్ణయించడు: దల్జీత్
మ్యాచ్‌ల ఫలితాలను క్యూరేటర్ నిర్ణయించడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆధ్వర్యంలోని పిచ్‌లు, మైదానాల కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫలితాలు వెల్లడైనా, కాకపోయినా క్యూరేటర్‌పై విమర్శలు గుప్పించడం చాలా మందికి అలవాటుగా మారిందన్నాడు. ఈ విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికాడు.
ఇలావుంటే, టెస్టు క్రికెట్‌కు ఎంపికైన పిచ్‌ల న్నిటిలోకీ నాసిరకమైనదిగా నాగపూర్ మైదానా న్ని పేర్కోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అభిప్రాయపడింది. మ్యాచ్‌లకు ఇలాం టి పిచ్‌లు పనికిరావని స్పష్టం చేసింది. అయ తే టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం పిచ్ తీ రును సమర్ధించింది.