క్రీడాభూమి

టీమిండియా బ్యాటింగ్ ప్రాక్టీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 22: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన రెండు రోజుల వామప్ మ్యాచ్‌ని భారత్ డ్రా చేసుకుంది. మొదటి రోజు ఆటలో లంక బోర్డు జట్టు 55.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌట్‌కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 135 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజైన రెండో రోజు ఆటను కొనసాగించింది. 68 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేసింది. శనివారం నాటి ఆటను భారత్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు కేటాయించినట్టు కనిపించింది.కెప్టెన్ విరాట్ కోహ్లీ 53, అజింక్య రహానే 40, రోహిత్ శర్మ 38, శిఖర్ ధావన్ 41 పరుగులు చేసి, రిటైర్డ్ అవుటయ్యారు. మిగతా వారికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చేందుకు వీలుగా వీరు తమంతట తామే అవుట్‌గా ప్రకటించుకొని రిటైరయ్యారు. హార్దిక్ పాండ్య 11, రవీంద్ర జడేజా 18 పరుగులు చేసి అవుటయ్యారు.

చిత్రం.. హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ