క్రీడాభూమి

గెలిస్తే చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 22: ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో, మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెల్చుకోవడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతున్నది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే ఈ తుది పోరాటంలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ గెలిస్తే, సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. 2005లో జరిగిన వరల్డ్ కప్‌లో భారత మహిళలు తొలిసారి ఫైనల్ చేరారు. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి యుద్ధంలో 98 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చారు. సుమారు పుష్కర కాలం తర్వాత భారత జట్టు మరోసారి మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మొదటిసారి ప్రపంచ కప్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో ఉన్న మిథాలీ బృందం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన విధానాన్ని చూస్తే, ఇంగ్లాండ్‌కు భారత్ నుంచి గట్టిపోటీ తప్పదని స్పష్టమవుతున్నది. ఇంతకు ముందు ఫైనల్ చేరినప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ఇనే్నళ్లకు ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి టోర్నీ నుంచి ఆసీస్‌ను ఇంటి దారి పట్టించింది. ఇంగ్లాండ్‌ను కూడా అదే తరహాలో ఓడించడానికి భారత్ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది. 1983లో, లార్డ్స్ మైదానంలోనే జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో బలమైన వెస్టిండీస్‌ను ఓడించిన కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ మొదటిసారి ట్రోఫీని స్వీకరించింది. ఇప్పుడు కూడా అదే మైదానంలో, భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ కప్‌ను అందిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు. కపిల్ సారథ్యంలో ప్రపంచ కప్‌ను సాధించిన తర్వాత మన దేశంలో పురుషుల క్రికెట్ జట్టు దశ మారిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న బోర్డుగా ఎదిగింది. మిథాలీ నేతృత్వంలో ఆదివారం ఇంగ్లాండ్‌పై విజయం లభిస్తే, మహిళల క్రికెట్ కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం. ఫైనల్ పోరాటంలో భారత్ గెలిస్తే, సరికొత్త చరిత్ర మొదలవుతుంది. 2005లో వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టులో మిథాలీ, ఝూలన్ సభ్యులుగా ఉన్నారు. మరోసారి ఫైనల్ చేరిన జట్టులో వీరిద్దరే సీనియర్లు. పైగా జట్టుకు మిథాలీ నాయకత్వం కూడా వహిస్తున్నది. వీరికి బహుశా ఇదే చివరి వరల్డ కప్ టోర్నమెంట్ కావచ్చు. అందుకే, విజయం కోసం సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు మాత్రమే మహిళల వరల్డ్ కప్‌లో టైటిళ్లు అందుకున్నాయి. ఆ జాబితాలో చేరేందుకు భారత్ తహతహలాడుతున్నది.
ప్రతీకారమే ఇంగ్లాండ్ లక్ష్యం!
ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్‌ను ఎదుర్కొని ఓటమిపాలైన ఇంగ్లాండ్ ఆదివారం నాటి ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఎంచుకుంది. హీతర్ నైట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్ జట్టులో వికెట్‌కీపర్ సారా టేలర్, నతాలీ షివర్ టాప్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నారు. సెమీ ఫైనల్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించడంలో అన్యా షబ్‌స్రోల్ బ్యాటింగ్ ప్రతిభ తోడ్పడింది. ఆమె చివరి ఓవర్‌లో విన్నింగ్ షాట్ కొట్టి, ఇంగ్లాండ్‌ను ఫైనల్ చేర్చింది. కాగితంపై చూస్తే, భారత్‌కు సమవుజ్జీగా కనిపిస్తున్న ఇంగ్లాండ్ ఫైనల్‌లో ఏ విధంగా ఆడుతుందో చూడాలి. ఈ జట్టు ఫైనల్ చేరడం ఇది ఏడోసారి. మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్ అప్పట్లో అనుసరించిన పాయింట్ల విధానాన్ని అనుసరించి, 17 పాయింట్ల ఆధిక్యంతో టైటిల్‌ను అందుకుంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత, 1993లో న్యూజిలాండ్‌ను 67 పరుగుల తేడాతో ఫైనల్‌లో ఓడించి టైటిల్ సాధించింది. 2009లో మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్‌లో న్యూజిలాండ్‌నే ఢీకొంది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 1978, 1982, 1988 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ ఫైనల్ చేరినప్పటికీ, అన్నిసార్లు కూడా ఆస్ట్రేలియా చేతిలోనే పరాజయాలను చవిచూసి, రెండో స్థానంతో సంతృప్తి చెందింది. ఈసారి ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఎదురుకాకపోవడం ఆ జట్టుకు లాభించే అంశం. లీగ దశలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడమేగాక, నాలుగోసారి వరల్డ్ కప్‌ను అందుకోవాలన్న కసితోవున్న ఇంగ్లాండ్‌కు భారత్‌ను ఓడించడం సులభం కాదు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది.