క్రీడాభూమి

ఔషధాల వినియోగంపై హెల్ప్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: వివిధ రకాలైన ఔషధాల వినియోగం, వాటి వల్ల డోపింగ్ పరీక్షలో పట్టుబడే అవకాశాలు వంటి అంశాలపై క్రీడాకారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి రోజుకు 24 గంటలు పని చేసే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్, బాడ్మిండ్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచించాడు. క్రీడా రంగంలో ఇటీవల పెరుగుతున్న డోపింగ్ కేసుల నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన అఖిల భారత క్రీడా మండలి (ఎఐసిఎస్) సమావేశంలో గోపీచంద్ మాట్లాడుతూ సాధారణ రుగ్మతలకు వాడే మందుల వల్ల కూడా డోపింగ్ పరీక్షల్లో పలువురు పట్టుబడుతున్నారని గుర్తుచేశాడు. దగ్గు కోసం ‘కోరెక్స్’ సిరప్ వాడినా, డోపింగ్ పరీక్షలో దోషిగా పట్టుబడతారని చెప్పాడు. మన దేశంలో అత్యంత సామాన్య రీతిలో వాడే మందుల్లో కొన్ని నిషిద్ధ మాదక ద్రవ్యాలు కిందకు వస్తాయన్నాడు. అందుకే, ఏ మందులు వాడాలి? వేటిని వాడకూడదు? అనే సమాచారం ఇవ్వడానికి వారంలో ఏడు రోజులు, రోజులో 24 గంటలు పని చేసే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే అథ్లెట్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు. విజయ్ కుమార్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘స్ప్రింట్ క్వీన్’ పిటి ఉష మాట్లాడుతూ వందలాది మంది అథ్లెట్ల నుంచి శాంపిల్స్ సేకరించడానికి ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంపిల్స్ తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కో క్రీడా విభాగానికి ఒక్కో స్పెషలిస్టు డాక్టర్‌ను నియమించాలని సూచించాడు. డోప్ శాంపిల్స్‌ను సేకరించే సిబ్బందిని తరచు మారుస్తూ ఉండాలని అన్నాడు. ఎక్కువ కాలం ఇదే పనిలో నిమగ్నమయ్యేవారు కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లకు లేదా ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారు డోప్ శాంపిల్స్‌ను తారుమారు చేయడానికి ప్రయత్నించవచ్చని అన్నాడు. క్రీడాకారులకు అన్ని రకాలుగా మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పాడు. ఎఐసిఎ చైర్మన్ విజయ్ కుమార్ మల్హోత్రా మాట్లాడుతూ డోప్ పరీక్షల్లో కొంత మంది పట్టుబడుతున్న అంశాన్ని మీడియా చాలా పెద్దదిగా చేసి చూపెడుతున్నదని ఆరోపించాడు. ఇలాంటి మితిమీరిన వైఖరి కేవలం క్రీడా రంగానికేగాక, యావత్ దేశ ప్రతిష్ఠకు కూడా భంగకరమని వ్యాఖ్యానించాడు.