క్రీడాభూమి

సౌరాష్ట్ర ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె: ముంబయితో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సౌరాష్ట్ర ఎదురుదాడికి దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైనప్పటికీ, ఆతర్వాత బౌలింగ్‌లో రాణించింది. మ్యాచ్ రెండో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి ముంబయి మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 262 పరుగులకు కట్టడి చేసింది. 8 వికెట్లకు 192 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర 235 పరుగులకు ఆలౌటైంది. చివరిలో ప్రెరక్ మంకడ్ 66, జైదేవ్ ఉనాద్కత్ 31 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబయి పరుగుల ఖాతాను తెరవకుండానే తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వికెట్ల పతనం కొనసాగింది. శ్రేయాస్ అయ్యర్ (117) క్రీజ్‌లో పాతుకుపోయి, సెంచరీ సాధించినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగిన స్థాయిలో ఆడలేకపోయారు. ఫలితంగా గురువారం ఆట ముగిసే సమయానికి ముంబయి ఎనిమిది వికెట్లు 262 పరుగులు చేసింది. సౌరాష్ట్ర కంటే 27 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ముంబయి చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి..

ఫైట్‌లో ఖలీకి గాయం

డెహ్రాడూన్, ఫిబ్రవరి 25: ‘ది గ్రేట్’ ఖలీగా క్రీడా ప్రపంచానికి తెలిసిన డబ్ల్యుడబ్ల్యుఇ మాజీ రెజ్లర్ దిలీప్ సింగ్ రాణా ఒక ఫైట్‌లో గాయపడ్డాడు. హల్ద్‌వానీలో జరిగిన ఫైట్‌లో మైక్ నాక్స్, బ్రాడీ స్టీల్‌తో తలపడిన ఖలీ తలకు, ఛాతీకి గాయాలయ్యాయి. అతనిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు ప్రకటించారు.