క్రీడాభూమి

ఫైనల్‌కు కశ్యప్, ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనాహెమ్ (అమెరికా), జూలై 23: యుఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ భారత్‌కు దక్కడం ఖాయమైంది. కామనె్వల్త్ గేమ్స్ విజేత పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ సెమీ ఫైనల్స్‌లో తమతమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరారు. ఇక టైటిల్ కోసం సహచరుల మధ్య జరిగే పోరులో ఎవరు గెలిచినా, భారత్‌కే పతకం లభిస్తుంది. సెమీ ఫైనల్లో కశ్యప్ 15-21, 21-15, 21-16 తేడాతో అతి కష్టం మీద కొరియా ఆటగాడు వాంగ్ హీ హియోను ఓడించాడు. మరో సెమీ ఫైనల్లో ప్రణయ్ 21-14, 21-19 ఆధిక్యంతో వియత్నాంకు చెందిన తియెన్ మిన్ గుయెన్‌పై విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. ఇద్దరు భారతీయులు ఒక అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. సింగపూర్ ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ ఢీకొన్నారు. ఆ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణీత్ విజయం సాధించి, కెరీర్‌లో మొదటి సూపర్ సిరీస్ టైటిల్‌ను అందుకున్నాడు.
ఇలావుంటే, మహిళల సెమీ ఫైనల్స్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి పోరాటం ముగిసింది. లూ చింగ్ యవో, యాంగ్ పొ హాన్ జోడీ చేతిలో వీరు 12-21, 21-12, 20-22 తేడాతో ఓటమిపాలయ్యారు.