క్రీడాభూమి

మహిళల విశ్వవిజేత ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఆదివారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ విజయభేరి మోగించింది. చివరి వరకూ పోరాడిన మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీని స్వీకరించింది. 1973, 1993, 2009 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ను సాధించిన ఇంగ్లాండ్ నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది. అన్య షబ్‌స్రోల్ ఆరు వికెట్లు పడగొట్టి, భారత్ బ్యాటింగ్ లైనప్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఒకానొక దశలో పటిష్ఠమైన స్థితిలో ఉన్న భారత్ చివరి ఎనిమిది వికెట్లను కేవలం 81 పరుగుల తేడాతో చేజార్చుకొని, రెండో స్థానంతో సంతృప్తి చెందింది. అయితే, 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, 219 పరుగులకు ఆలౌటైనప్పటికీ భారత క్రీడాకారిణులు జరిపిన పోరాటానికి క్రికెట్ అభిమానులు జేజేలు పలుకుతున్నారు.