క్రీడాభూమి

రాహుల్‌కు జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 24: భారత బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ జ్వరంతో బాధపడుతున్నాడు. దీనితో అతను శ్రీలంకతో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొలంబోలో లంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన రాహుల్‌కు జ్వరంగా ఉందని, దీనితో అతను నెట్ ప్రాక్టీస్‌కు రాలేకపోయాడని పేర్కొంది. రాహుల్ అందుబాటులో లేకపోవడంతో, మొదటి టెస్టులో అభినవ్ ముకుంద్, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా దిగనున్నారు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా లంక సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.
పుష్కకుమారకు చోటు
భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన శ్రీలంక జట్టులో వెటరన్ స్పిన్నర్ మలిందా పుష్పకుమారకు చోటు దక్కింది. 30 ఏళ్ల పుష్పకుమార ఇప్పటి వరకూ కెరీర్‌లో 558 ఫస్ట్‌క్లాస్ వికెట్లు సాధించాడు. ఇనే్నళ్లకు అతనికి జాతీయ జట్టులో స్థానం లభించింది.
జట్టు వివరాలు: రంగన హెరాత్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, దిముత్ కరుణరత్నే, కుశాల్ మేండిస్, ఏంజెలో మాథ్యూస్, అసెల గుణరత్నే, నిరోషన్ డిక్‌విల్లా, ధనంజయ డి సిల్వ, ధనుష్క గుణతిలక, దిల్‌రువాన్ పెరెరా, సురంగ లక్మల్, లాహురు కుమార, విశ్వ ఫెర్నాండో, మలిందా పుష్పకుమార, నువాన్ ప్రదీప్.

చిత్రం.. లోకేష్ రాహుల్