క్రీడాభూమి

శ్రీని, షా అనర్హులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: భారత క్రికెట్‌పై పెత్తనం చెలాయించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, సీనియర్ అధికారి నిరంజన్ షాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బోర్డు సమావేశాల్లో పాల్గొనే అర్హత వీరికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశాలకు శ్రీని, షా హాజరుకావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై స్పష్టతనివ్వాలని పాలనాధికారుల బృందం (సిఒఎ) చేసిన విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈనెల 26న జరిగే బిసిసిఐ సమావేశానికి హాజరుకావద్దని ఆ ఇద్దరినీ ఆదేశించింది.