క్రీడాభూమి

‘సిక్స్ సిక్సెస్’ జాబితాలో రాస్ వైట్లీకి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెడింగ్లే, జూలై 24: సీనియర్స్ స్థాయి క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాస్ వైట్లీకి చోటు దక్కింది. వర్సెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్న అతను ఇంగ్లీష్ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా యార్క్‌షైర్ స్పిన్నర్ కార్ల్ కార్వెర్ బౌలింగ్‌లో ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మార్చాడు. అయితే, ఆ మ్యాచ్‌లో వర్సెస్టర్‌షైర్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా గారీ సోబర్గ్ రికార్డు సృష్టించాడు. 1968లో స్వాన్‌సీలో జరిగిన కౌంటీ చాంపియన్‌షిప్‌లో నాటింహామ్‌షైర్ తరఫున ఆడిన అతను ఒక మ్యాచ్‌లో గ్లామర్‌గాన్ బౌలర్ మాల్కం నాష్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్ స్థాయి క్రికెట్‌లో మరో ముగ్గురు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. 1985లో ముంబయి తరఫున ఆడిన ప్రస్తుత టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ బరోడా బౌలర్ తిలక్ రాజ్ వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు సాధించాడు. 2007లో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్, అదే ఏడాది వరల్డ్ కప్ పోరులో డాన్ వాన్ బన్జ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెర్చెల్ గిబ్స్ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టారు. ఆ జాబితాలో తాజాగా వైట్లీ కూడా చేరాడు.

చిత్రం.. రాస్ వైట్లీ