క్రీడాభూమి

ఒత్తిడే ఓటమికి కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 24: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తీవ్రమైన ఒత్తిడికి గురికావడమే తమ ఓటమికి ప్రధాన కారణమని భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. తుది పోరులో ఓడినప్పటికీ, ఈ టోర్నీ మొత్తంలో జట్టు అద్భుతంగా ఆడిందని, అందుకు తాను గర్వపడుతున్నానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్లకు 228 పరుగులకే పరిమితం చేసిన ఝూలన్ గోస్వామిని మిథాలీ ప్రశంసించింది. జట్టు అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడానికి ఆమె ఎప్పుడూ ముందు ఉంటుందని, ఈసారి కూడా అదే స్థాయిల ఆడిందని చెప్పింది. అయితే, ఇంగ్లాండ్ బాగా ఆడి, టైటిల్ గెల్చుకుందని చెప్పింది.
వచ్చే వరల్డ్ కప్ ఆడనేమో: వచ్చే వరల్డ్ కప్‌లో తాడతానో లేదో తాను చెప్పలేనని మిథాలీ చెప్పింది. ఒక ప్రశ్నపై ఆమె స్పందిస్తూ, ఒకటి రెండు సంవత్సరాలు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించడం ఖాయమని తెలిపింది. అయితే, వచ్చే వరల్డ్ కప్ వరకూ కొనసాగడం కష్టమేనని స్పష్టం చేసింది. బహుశా అప్పటికి తాను కెరీర్ నుంచి వైదొలగుతానేమోనని అనుమానం వ్యక్తం చేసింది.
అరుదైన గౌరవం..
లండన్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది మహిళల వరల్డ్ కప్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన వారితో కూడిన జట్టుకు మిథాలీని కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఎంపిక చేసింది. 34 ఏళ్ల మిథాలీ నాయకత్వంలో భారత్ రన్నరప్ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. సుమారు నెల రోజులు సాగిన ఈ టోర్నీలో ఆమె 409 పరుగులు సాధించి, కెప్టెన్‌గానేగాక, బ్యాట్స్‌మన్‌గానూ స్ఫూర్తిదాయక సేవలు అందించింది. న్యూజిలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 109 పరుగులు సాధించి, భారత్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. కాగా, మిథాలీతోపాటు, సెమీ ఫైనల్స్ సెంచరీ స్టార్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ కూడా ఐసిసి జట్టులో ఉన్నారు.
ఐసిసి వరల్డ్ కప్ జట్టు: 1. మిథాలీ రాజ్ (కెప్టెన్/ బ్యాట్స్‌మన్/ భారత్), 2. హర్మన్‌ప్రీత్ కౌర్ (ఆల్‌రౌండర్/ భారత్), 3. దీప్తి శర్మ (బ్యాట్స్‌మన్/ భారత్), 4. టాంసిన్ ‘టామీ’ బ్యూవౌంట్ (బ్యాట్స్‌మన్/ ఇంగ్లాండ్/ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్), 5. అన్య షబ్‌స్రోల్ (బౌలర్/ ఇంగ్లాండ్/ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్), 6. సారా టేలర్ (వికెట్‌కీపర్/ ఇంగ్లాండ్), 7. అలెక్స్ హార్ట్‌లీ (స్పిన్నర్/ ఇంగ్లాండ్), 8. లారా వాల్వార్ట్ (ఓపెనర్/ దక్షిణాఫ్రికా), 9. మరిజానే కాప్ (బౌలర్/ దక్షిణాఫ్రికా), 10. డేన్ వాన్ నికెర్క్ (బౌలర్/ దక్షిణాఫ్రికా), 11. ఎలిస్ పెర్రీ (ఆల్‌రౌండర్/ ఆస్ట్రేలియా).
12వ ప్లేయర్: నతాలీ షివెర్ (ఇంగ్లాండ్).

చిత్రం.. మిథాలీ రాజ్