క్రీడాభూమి

‘చాంపియన్స్’కు కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 27: ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్ సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు కోట్లకు పడగలెత్తారు. ప్రైజ్‌మనీగా లభించింది. సుమారు 23 కోట్ల రూపాయలను ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు పంచాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ముందుగానే నిర్ణయించింది. ఎలాంటి కోతలు లేకుండా ఈ మొత్తం చేతికి అందడంతో, ఈ టోర్నీకి ఎంపికైన మొత్తం 16 మంది ఆటగాళ్లతోపాటు, మేనేజ్‌మెంట్‌ను కూడా కలిపి 17 వాటాలుగా విభజించింది. దీనితో ప్రతి ఆటగాడికి సుమారు 1.35 కోట్ల రూపాయలు లభిస్తాయి. మేనేజ్‌మెంట్‌లోని సభ్యులకు తలా సుమారు 10 లక్షల రూపాయలు దక్కుతాయి. త్వరలోనే నిర్వహించే ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆటగాళ్లను సన్మానించి, చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ చెక్కులను అందచేస్తాడు.