క్రీడాభూమి

కోచ్‌గా వకార్ యూనిస్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: మాజీ పేసర్, మాజీ కోచ్ వకార్ యూనిస్ క్రికెటర్‌గా దేశానికి గొప్ప సేవలు అందించినప్పటికీ, జట్టుకు సరైన మార్గదర్శకం ఇవ్వడంలో దారుణంగా విఫలమయ్యాడని వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ ధ్వజమెత్తాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ వకార్ కోచ్‌గా ఎంతమాత్రం స్ఫూర్తిదాయకమైన విజ్ఞతను ప్రదర్శించలేకపోయాడని వ్యాఖ్యానించాడు. పదేపదే ఆటగాళ్లను మార్చడం నుంచి, నెట్స్‌లో విపరీతంగా శ్రమించడం ద్వారానే విజయాలు సాధ్యమవుతాయన్న తప్పుడు అభిప్రాయం వరకూ వకార్ అన్ని రకాలుగా జట్టును దెబ్బతీశాడని ఆరోపించాడు. 2010 నుంచి 2011 వరకు మొదటిసారి, 2014 నుంచి 2016 వరకు రెండోసారి పాక్ జట్టుకు వకార్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ రెండు పర్యాయాలు అతను సరైన వ్యూహ రచన చేయలేకపోయాడని అక్మల్ అన్నాడు. పొరపాట్లు నిర్ణయాల కారణంగా పాక్ జట్టు తిరోగమనంలో నడించిందని వాపోయాడు. కొంత మంది ఆటగాళ్లంటే అతనికి సరిపడేది కాదని, అందుకే, వారిని తుది జట్టు నుంచి తప్పించడానికి విశ్వప్రయత్నాలు చేసేవాడని ఆరోపించాడు. ఆటగాళ్లను నిలదొక్కుకోనివ్వకుండా, వారు నిరంతరం భయం నీడలోనే కుంగిపోయేలా చేసేవాడని మండిపడ్డాడు. 2015 వరల్డ్ కప్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల్సిందిగా యూనిస్ ఖాన్‌ను కోరవడం, సర్ఫ్‌రాజ్ అహ్మద్‌ను చివరి మ్యాచ్ వరకూ నిరీక్షింప చేయడం వంటి పలు నిర్ణయాలను కమ్రాన్ తప్పుపట్టాడు. ఆసియా కప్ మ్యాచ్‌లో ఉమర్ అక్మల్ శతకాన్ని సాధించినప్పటికీ, ఆతర్వాతి మ్యాచ్‌లో అతనిని టాప్ ఆర్డర్‌లో కాకుండా, షహిద్ అఫ్రిదీ తదితరుల తర్వాత బ్యాటింగ్‌కు దింపాడని గుర్తుచేశాడు. ఈ విధమైన చర్యలు పాక్ జట్టును తీవ్రంగా దెబ్బతీశాయని అన్నాడు. వకార్‌ను అత్యుత్తమ బౌలర్‌గా తాను ఎప్పుడూ గౌరవిస్తానని, కానీ, కోచ్‌గా అతను జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాడని వ్యాఖ్యానించాడు.

చిత్రం.. కమ్రాన్ అక్మల్