క్రీడాభూమి

భారత క్రికెట్ బోర్డుపై కేసుకు 100 కోట్లు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 29: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై కేసు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, ఇది ముమ్మాటికీ నిజమేనని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని వివాదాల పరిష్కార కమిటీలో కేసు వేశామని, దీని ఖర్చుల కోసం 100 కోట్ల రూపాయలను ఇప్పటికే మంజూరు చేశామని ఆ ప్రకటనలో వివరించాడు. 2015లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత జట్టు పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాలని గుర్తుచేశాడు. రొటేషన్ విధానాన్ని అనుసరించి ఈసారి పాక్‌లోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడాలని, కానీ, ఆ ఒప్పందాన్ని భారత్ అమలు చేయడం లేదని మండిపడ్డాడు. పాకిస్తాన్‌లో భద్రతాపరమైన అంశాలు తలెత్తుతున్నట్టు లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ అనుమానాలు వ్యక్తం చేయడంతో పిసిబి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని కేంద్రంగా ఎంచుకొని, అక్కడే మ్యాచ్‌లు ఆడుతున్నది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత్ కూడా యుఎఇకే వెళ్లాల్సి ఉంటుంది. కానీ, యుఎఇలో ఆడే ప్రసక్తి లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని షహర్యార్ ప్రస్తావిస్తూ, ఐసిసి నిబంధనలను అనుసరించి ఫిక్చర్స్ అండ్ ఫ్యూచర్స్ ప్రోగ్రామ్ కింద కుదిరిన ఒప్పందాన్ని ఆయా క్రికెట్ జట్లు అమలు చేయక తప్పదని అన్నాడు. ఇలావుంటే, భారత్ వైఖరి ఏమిటో తెలియక, అర్థంగాక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్న పిసిబి ఇప్పుడు చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఒప్పందాన్ని అనుసరించి భారత్ దైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో తాము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని షహర్యార్ అన్నాడు. ఐసిసి కమిటీలో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత్‌కు మేమంటే భయం
భారత క్రికెట్ జట్టుకు తామంటే భయమని, అందుకే, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు వెనుకడుగు వేస్తున్నదని షహర్యార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా భారత్‌తో సిరీస్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నాడు. ఈ సవాలును భారత్ స్వీకరిస్తుందా అని ప్రశ్నించాడు. భారత్ కంటే తాము అన్ని విధాలా బలంగా ఉన్నామనడానికి ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనలే ఉదాహరణ అన్నాడు.