క్రీడాభూమి

ప్రో కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టెలు గు టైటాన్స్ జట్టు అనూహ్యంగా పాట్నా పైరేట్స్ చేతిలో ఓటమిపాలైంది. పరదీప్ నర్వాల్ 15 పరుగులు సాధించడంతో పాట్నా పైరేట్స్ జట్టు 35 పాయంట్లు చేయగలిగింది. మోనూ గోయత్ 8, విశాల్ మానే 3 చొప్పున పాయంట్లు సంపాదించారు. హైదరాబాద్ తరఫున రాహుల్ చౌదరి 7 పాయంట్లతో టాపర్‌గా నిలిచాడు. నీలేష్ సాలుంకే 6, వికాశ్, విశాల్ భరద్వాజ్ చెరి 5 చొప్పున పాయంట్లు సంపాదించారు.
జైపూర్‌పై ఢిల్లీ గెలుపు
హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌ను దబాంగ్ ఢిల్లీ నాలుగు పాయింట్ల తేడాతో ఓడించింది. ఢిల్లీ 30 పాయింట్లు సాధించగా, జైపూర్ 26 పాయింట్లు రాబట్టగలిగింది. ఢిల్లీ తరఫున పవన్ కుమార్ 7, జస్వీర్ సింగ్ 5, ఢిల్లీ ఆటగాళ్లలో మిరాజ్ షేక్ 7, నీలేష్ 5 చొప్పున పాయింట్లు చేశారు.

చిత్రం.. పరదీప్ నర్వాల్