క్రీడాభూమి

కోర్టు ఆదేశాలు అమలుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: మహిళా అథ్లెట్ పియు చిత్ర కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ)కి కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ సూచించాడు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల 1,500 మీటర్ల విభాగంలో చిత్ర స్వర్ణ పతకం సాధించింది. అయితే, ఆమెను ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం ఎంపిక చేసిన బృందంలో ఎఎఫ్‌ఐ చేర్చకపోవడం వివాదాన్ని సృష్టించింది. నిబంధనల ప్రకారం, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన తనకు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు నేరుగా అర్హత లభిస్తుందని, కానీ, ఎఎఫ్‌ఐ ఉద్దేశపూర్వకంగానే జాబితా నుంచి తన పేరును తొలగించిందని చిత్ర ఆరోపించింది. తనకు న్యాయం చేయాల్సిందిగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీల్‌ను పరిశీలించిన కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆమె పేరును జాబితాలో చేర్చాలని ఎఎఫ్‌ఐని ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాలపై మంత్రి గోయల్ స్పందించారు. చిత్ర కేసులో కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఎఎఫ్‌ఐకి సూచించాడు. ఒక రకంగా ఆమె చేరికను వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా భావించాలని సలహా ఇచ్చాడు. భవిష్యత్తులో కోర్టు ధిక్కారం కేసును ఎదుర్కొనే పరిస్థితిని కొనితెచ్చుకోవద్దని హెచ్చరించాడు.