క్రీడాభూమి

అనుకున్నది సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 29: శ్రీలంకలో 2015లో పర్యటించినప్పుడు గాలే మైదానంలోనే అనుకోని ఓటమి ఎదురైందని, ఆ పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మొదటి టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ నిజానికి రెండేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లోనూ తాము గెలిచే స్థితిలోనే ఉన్నామని, కానీ, ఎవరూ ఊహించని రీతిలో ఓడామని చెప్పాడు. అమీతుమీ తేల్చుకోవాలన్న పట్టుదలతో ఈ మ్యాచ్‌ని ఆడి, అనుకున్నది సాధించామని తెలిపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అతను ప్రశంసల్లో ముంచెత్తాడు. ధావన్ బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతమని అన్నాడు. మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా ఆడినట్టు చెప్పాడు. నిజానికి అతను సెంచరీకి అర్హుడని వ్యాఖ్యానించాడు. బౌలర్లు సమయోచితంగా బంతులు వేసి, లంకను కట్టడి చేశారని చెప్పాడు. అజేయ సెంచరీతో నిలవడం తనకు ఆనందాన్నిచ్చిందని కోహ్లీ అన్నాడు. వాస్తవానికి పిచ్ ఏమాత్రం సహకరించలేదని, కానీ, పట్టుదలతో పరుగులు రాబట్టామని చెప్పాడు.
భారత్ గొప్పగా ఆడింది: హెరాత్
భారత్ అన్ని విభాగాల్లోనూ గొప్పగా ఆడిందని శ్రీలంక కెప్టెన్ రంగన హెరాత్ అన్నాడు. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి కొనియాడాడు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అసెల గుణరత్నే రెండు ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రాలేకపోవడం జట్టును దెబ్బతీసిందని చెప్పాడు. అదే విధంగా తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు వేలికి గాయమైందని, అందుకే, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయానని అన్నాడు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందని, రెండో టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని ధీమా వ్యక్తం చేశాడు.
జట్టు ప్రయోజనాలే ముఖ్యం: అశ్విన్
తనకు రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన అతను, రాబోయే ఆరు టెస్టుల్లో మరో 25 వికెట్లు సాధిస్తే, వేగంగా 300 వికెట్లను చేరుకున్న బౌలర్‌గా మరో రికార్డు సృష్టిస్తాడు. అయితే, తాను బౌలింగ్ చేసే సమయాల్లో ఆ ఆలోచనే రాలేదని, రికార్డుల గురించి ఆలోచించనని అశ్విన్ చెప్పాడు. జట్టు ప్రయోజనాల ముందు వ్యక్తిగత మైలురాళ్లకు విలువ ఉండదని వ్యాఖ్యానించాడు.

చిత్రం.. శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే అవుట్ చేసిన
భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాను అభినందిస్తున్న సహచరులు