క్రీడాభూమి

పన్ను ఎగవేత కేసులో కోర్టుకు రొనాల్డో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, జూలై 29: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పన్ను ఎగవేత కేసులో సోమవారం కోర్టు ముందుకు హాజరవుతాడని సమాచారం. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారుడిగా ఎదిగిన అతను 17.2 మిలియన్ డాలర్లు (సుమారు 117 కోట్ల రూపాయలు) మేరకు పన్ను ఎగవేశాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు. తాను ఎలాంటి పొరపాటు చేయలేదని రొనాల్డో వాదిస్తున్నప్పటికీ, పొజూలొ డి అలార్కన్ కోర్టు ఇటీవలే అతనికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది. 2010 నుంచి అమల్లోకి వచ్చిన పన్ను విధానం ప్రకారం రొనాల్డో పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఆదాయాన్ని తక్కువ చూపడం ద్వారా ఎగవేతకు పాల్పడ్డాడని స్పెయిన్ ఆదాయపన్ను శాఖ కేసు దాఖలు చేసింది. అయితే, చాలాకాలంగా రొనాల్డో కోర్టుకు హాజరుకావడం లేదు. సోమవారం కూడా అదే రీతిలో గైర్హాజరైతే, కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. అందుకే, రొనాల్డో కోర్టు ముందుకు వస్తాడని అంటున్నారు.

చిత్రం.. సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో