క్రీడాభూమి

ఇంటర్నేషనల్ చాంపియన్స్ కప్ విజేత బార్సిలోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, జూలై 30: ఇంటర్నేషనల్ చాంపియన్స్ కప్ సాకర్ టైటిల్‌ను బార్సిలోనా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు చిరకాల ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్‌ను 3-2 తేడాతో ఓడించింది. గారార్డ్ పెక్ కీలక గోల్ చేసి, బార్సిలోనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బార్సిలోనాకు స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, ఇవాన్ రాకిటిక్ చెరొక గోల్ అందించారు. మ్యాచ్‌లో పది నిమిషాల ఆట కూడా పూర్తికాక ముందే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బార్సిలోనా ఆతర్వాత రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. అయితే, మొదట్లో ఒత్తిడి కారణంగా చేతికి అందిన అవకాశాలను చేజార్చుకున్న రియల్ మాడ్రిడ్ ఆతర్వాత నిలదొక్కుకొని, ఎదురుదాడికి దిగింది. మటెయో కొవాసిక్, మార్కో అసెన్సియో గోల్స్ సాధించి, రియల్ మాడ్రిడ్ అభిమానులకు విజయంపై ఆశలు రేపారు. ఇరు జట్ల స్కోరు సమం కావడంతో హార్డ్ రాక్ స్టేడియంలో ఉత్కంఠ చోటు చేసుకుంది. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని, ఫలితాన్ని నిర్దేశించడానికి పెనాల్టీ షూటౌట్ తప్పదని అంతా ఒక నిర్ణయానికి వచ్చిన సమయంలో, రియల్ మాడ్రిడ్ రక్షణ వలయాన్ని ఛేదించిన గెరార్డ్ పిక్ అద్భుతమైన గోల్‌ను నమోదు చేశాడు. దీనితో 3-2 ఆధిక్యాన్ని సంపాదించిన బార్సిలోనా అదే తేడాతో విజయం సాధించి టైటిల్‌ను అందుకుంది.

చిత్రం.. మియామీలో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్స్ కప్ సాకర్ టోర్నమెంట్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లను తప్పించుకొని, గోల్ చేస్తున్న బార్సిలోనా సూపర్ స్టార్ మెస్సీ