క్రీడాభూమి

చెక్ బాక్సింగ్ టోర్నీలో భారత్ విన్నింగ్ పంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న 48వ గ్రాండ్ ప్రీ ఉస్తీ నాడ్ లాబెమ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో రాణించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం ఐదు స్వర్ణాలు, రెండు రజతాలతోపాటు ఒక కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత శివ ధాపా 60 కిలోల విభాగంలో విజేతగా నిలిచాడు. అతనితోపాటు మనోజ్ కుమార్ (69 కిలోలు), అమిత్ ఫంగల్ (52 కిలోలు), గౌరవ్ బింధూరి (56 కిలోలు), సతీష్ కుమార్ (+91 కిలోలు) స్వర్ణాలను సాధించారు. ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిన శివ థాపా చెక్ బాక్సింగ్ ఫైనల్‌లో స్లొవేకియా బాక్సర్ ఫిలిప్ మెజారస్‌ను 5-0 తేడాతో చిత్తుచేశాడు. స్థానిక ఫేవరిట్ డేవిడ్ కొటర్‌ను మనోజ్ 5-0 ఆధిక్యంతో ఓడించాడు. అమిత్ ఫంగల్ తుది ఫైట్‌లోకవీందర్ బిస్త్‌పై 3-2 తేడాతో గెలిచాడు. గౌరవ్ సైతం 5-0 తేడాతోనే పోలాండ్ బాక్సర్ లానో జరొస్లాపై విజయం సాధించాడు. సతీష్ కుమార్ ఫైనల్ పోరులో జర్మనీకి చెందిన మాక్స్ కెల్లెర్‌పై గెలిచి, స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఇలావుంటే, అమిత్ చేతిలో ఓడిన కవీందర్, ఇబ్రగిమ్ బజూవ్ (జర్మనీ)ను ఢీకొని పరాజయాన్ని ఎదుర్కొన్న మనీష్ పన్వార్ రజత పతకాలు సాధించారు. 91 కిలోల విభాగంలో సుమీత్ సంగ్వాన్ సెమీ ఫైనల్ పోరును చేజార్చుకొని, కాంస్య పతకంతో సరిపుచ్చాడు.

చిత్రం.. శివ ధాపా