క్రీడాభూమి

వరల్డ్ చాంపియషిప్స్‌కు అర్హతను ఊహించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే అర్హత లభిస్తుందని తాను ఊహించలేదని భారత యువ బాడ్మింటన్ స్టార్ సమీర్ వర్మ అన్నాడు. ఆదివారం అతను పిటిఐతో మాట్లాడుతూ, అనుకోకుండా తనకు అవకాశం కలిసివచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకొని పతకంతోనే తిరిగి వస్తానని అన్నాడు. ఈ ఏడాది మే మాసం వరకూ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడే అవకాశం తనకు ఉండిందని, కానీ, సింగపూర్ ఓపెన్‌లో విఫలమయ్యానని చెప్పాడు. ఆ టోర్నీలో సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ చేరుకున్న విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఈ ఫలితాల కారణంగానే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తరచు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ టోర్నీని గెల్చుకోవడమేగాక, ఇండియా సూపర్ సిరీస్‌లో క్వార్టర్ ఫైనల్ వరకూ చేరిన సమీర్ అన్నాడు. ర్యాంకింగ్స్‌పై స్పష్టత ఏర్పడని కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఆడే అవకాశం చేజారిపోయిందనే అనుకున్నట్టు చెప్పాడు. కానీ, కొంత మంది టోర్నీ నుంచి వైదొలగడంతో తనకు ఊహించని అవకాశం లభించిందని అన్నాడు. సర్వశక్తులు ఒడ్డి, భారత్‌కు పతకాన్ని అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు.

చిత్రం.. సమీర్ వర్మ