క్రీడాభూమి

ప్రో కబడ్డీ లీగ్ ..పోరాడి ఓడిన హర్యానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: ప్రో కబడ్డీ లీగ్‌లోకి కొత్తగా అడుగు పెట్టిన హర్యానా స్టీలర్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో యు ముంబాతో చివరి వరకూ పోరాడి, ఒక పాయంట్ తేడాతో ఓడించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా 29 పాయంట్లు సాధించగా, హర్యానా 28 పాయంట్లు సంపాదించింది. కషిలింగ్ 7, అనూప్ కమార్ 6, సురీందర్ సింగ్ 4 చొప్పున పాయంట్లు సాధించి, యు ముంబాను విజయపథంలో నడిపారు. హర్యానా తరఫున వికాస్ ఖండోలా, వజీర్ సింగ్ చెరి 6 పాయంట్లు చేశారు. సురేందర్ నందా 5 పాయంట్లు అందించాడు. 100 శాతం స్ట్రయక్ రేట్ సాధించిన వికాస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మళ్లీ ఓడిన టైటాన్స్
ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూ బుల్స్‌ను ఢీకొన్న టైటాన్స్ 21 పాయంట్లు చేసింది. బెంగళూరు 31 పాయంట్లు సాధించి, పది పాయంట్ల తేడాతో గెలిచింది.