క్రీడాభూమి

స్టీపుల్ ఛేజ్ రన్నర్ సుధకు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ రన్నర్ సుధా సింగ్‌కు నిరాశ తప్పలేదు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) నిర్వాకం కారణంగా ఆశనిరాశల మధ్య ఊగిసలాడిన సుధ తనకు అధికారులు మొండి చేయి చూపారని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. వివరాల్లోకి వెళితే, లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు 24 మంది సభ్యులతో కూడిన జాబితాను ఎఎఫ్‌ఐ విడుదల చేసింది. అందులో సుధ పేరు లేదు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించినప్పటికీ తనకు అవకాశం లభించకపోవడంతో సుధ నిరాశ చెందింది. అయితే, అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ప్రకటించిన జాబితాలో భారత్ నుంచి స్టీపుల్ ఛేజ్‌లో పాల్గొంటున్నట్టుగా తన పేరు కనిపించడంతో ఆమెలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎఎఫ్‌ఐ పొరపాటున తన పేరును చేర్చలేదని, ఆతర్వాత జాబితాను సవరించి ఉంటారని అనుకుంది. కానీ, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సుధ పాల్గొనడం లేదని ఇప్పటికే కొంత మంది అథ్లెట్లతో కలిసి లండన్ వెళ్లిన జాతీయ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ చేసిన ప్రకటనతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆసియా చాంపియన్‌షిప్స్‌లోనే మహిళల 1,500 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించిన పియు చిత్ర విషయంలోనూ ఎఎఫ్‌ఐ ఇదే రీతిలో వ్యవహరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. చిత్రకు అవకాశం కల్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎఎఫ్‌ఐ అధికారులు ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి.

చిత్రం.. సుధా సింగ్