క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు రెండు కొత్త కేంద్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం మరో రెండు కేంద్రాలకు లభించే అవకాశాలున్నాయి. వీటిలో ఒకటి తిరువనంతపురం (కేరళ) స్టేడియంకాగా, మరొకటి అస్సాంలోని బర్సాపరాలో కొత్తగా నిర్మించిన స్టేడియం. ఈ ఏడాది సెప్టెంబర్-డిసెంబర్ మధ్యకాలంలో టీమిండియా రికార్డు స్థాయిలో 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం దాదాపు ఖాయమైంది. పెరుగుతున్న మ్యాచ్‌లకు అనుగుణంగా కొత్త కేంద్రాలను అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేయాలని టూర్స్ అండ్ ఫిక్స్‌చర్స్ కమిటీ (టిఎఎఫ్‌సి) ఇంతకు ముందే నిర్ణయించింది. మంగళవారం కోల్‌కతాలో జరిగే సమావేశంలో తిరువనంతపురం, బర్సాపరా స్టేడియాలకు అంతర్జాతీయ హోదాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో వారం వరకూ ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు వనే్డలు, మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఆ వెంటనే న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్‌లు జరుగుతాయి. కివీస్‌తో టీమిండియా మూడు వనే్డలు, మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఈ సిరీస్ నవంబర్ మొదటి వారంతో ముగుస్తుంది. నవంబర్ రెండో వారం నుంచి, డిసెంబర్ చివరి వరకూ శ్రీలంకతో మూడు టెస్టులు, మూడు వనే్డలు, మూడు టి-20 ఇంటర్నేషనల్స్‌లో పోటీపడుతుంది. మొత్తం మీద మూడు టెస్టులు, 11 వనే్డలు, తొమ్మిది టి-20 ఇంటర్నేషనల్స్‌కు రంగం సిద్ధమైందని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. పిఎఎఫ్‌సి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని, అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు పిటిఐతో మాట్లాడుతూ తెలిపాయి. దేశంలోని అన్ని కేంద్రాల్లోనూ కనీసం ఒక మ్యాచ్ జరిగే విధంగా పిఎఎఫ్‌సి జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నాయి. కొచ్చిలోని నెహ్రూ స్టేడియంలో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఇదే స్టేడియంలో ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. సాకర్ మ్యాచ్‌లకు పచ్చిక ఎక్కువగా ఉండాలి కాబట్టి, ఆ వెంటనే నెహ్రూ స్టేడియంలో వనే్డ ఇంటర్నేషనల్ కాకుండా టెస్టు మ్యాచ్ జరగవచ్చు. ప్రస్తుతం సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న నాగపూర్‌లో ఒక టెస్టును కేటాయించవచ్చు. భారీగా ప్రేక్షకులు వచ్చే కోల్‌కతా, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, మొహాలీ స్టేడియాల్లో వనే్డ, టి-20 మ్యాచ్‌లు జరుగుతాయని అంటున్నారు.

చిత్రం.. తిరువనంతపురం (కేరళ) స్టేడియం