క్రీడాభూమి

లాగోస్ బాడ్మింటన్ విజేత రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: లాసోస్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత ఆటగాడు రాహుల్ యాదవ్ కైవసం చేసుకున్నాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం నైజీరియాలో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో అతను మన దేశానికే చెందిన కరన్ రాజన్ రాజరాజన్‌ను 21-15, 21-13 తేడాతో ఓడించాడు. నిరుడు మారిషస్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన ఈ 19 ఏళ్ల యువ ఆటగాడు మరోసారి అదే స్థాయిలో రాణించి సత్తా చాటాడు. కాగా, పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కే టైటిల్ దక్కింది. మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 21-13, 21-15 ఆధిక్యంతో అలోఫువా అనోలువపో, జువాన్ ఒపెయొరీ జోడీని ఓడించింది. మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి మగోధో ఆగ్రే రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌లో ఆమె శ్రీలంకకు చెందిన తిలినీ ప్రమోదికా హెండాహెవా చేతిలో 12-21, 14-21 తేడాతో ఓటమిపాలైంది.
నేటి నుంచి న్యూజిలాండ్ ఓపెన్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్ తదితరులు టైటిల్‌పై కనే్నసి బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో తన్వీ లాడ్, మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డి జోడీ, పురుషుల డబుల్స్‌లో స్వాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ ఫేవరిట్స్‌గా ఉన్నారు.