క్రీడాభూమి

రికార్డు హీరో రుడిషాకు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 31: కెన్యాకు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్ డేవిడ్ రుడిషా శుక్రవారం నుంచి ప్రారంభం కాను న్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం లేదు. గాయం కారణంగా తాను వైదొలగుతున్నట్టు రుడి షా ప్రకటించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అతను పురుషుల 800 మీటర్ల పరుగును 40.91 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాను స్వర్ణం ప తకం అందుకున్న అదే స్టేడియంలో జరిగే ప్రపంచ అథ్లె టిక్స్‌లో పోటీపడాలని ఎంతగానో అనుకున్నప్పటికీ తన ఆశ నెరవేరడం లేదని వాపోయాడు. కండరాల నొప్పి తీ వ్రంగా ఉందని, ప్రస్తు పరిస్థితుల్లో తాను పరిగెత్తలేనని తెలిపాడు. త్వరలోనే ఫిట్నెస్ సంపాదించుకుంటానని అతను ధీమా వ్యక్తం చేశాడు.

సుధ పేరు తొలగింపు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే అవకాశాన్ని మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ రన్నర్ సుధా సింగ్ కోల్పోయంది. ఆమె పేరును భారత్ పంపిన జాబితా నుంచి తొలగిస్తున్నట్టు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ప్రకటించింది. అంతకు ముందు జాబితాలో ఆమె పేరు ఉన్న విషయం తెలిసిందే.

చిత్రం.. డేవిడ్ రుడిషా