క్రీడాభూమి

రవి శాస్ర్తీ కొత్త టెక్నిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 31: నెట్ ప్రాక్టీస్‌లో టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ కొత్త టెక్నిక్‌ను ప్రవేశపెట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఏ విధంగా ఆడతారో అదే రీతిలో నెట్స్‌లో ఆడాలని క్రికెటర్లకు సూచించాడు. అతను అనుసరించిన విధానం అద్భుత ఫలితాన్నిచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 190 పరుగులు సాధించాడు. చటేశ్వర్ పుజారా శతకంతో అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే వారు సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకోవాలి. అదే సమయంలో అవసరానికి తగినట్టు పరుగులు రాబట్టాలి. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే మరోవైపు పరుగులు సాధించడం అనుకున్నంత సులభం కాదు. అయితే, ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడానికి నెట్స్‌ను రవి శాస్ర్తీ ఎంచుకున్నాడు. ప్రతి ఆటగాడూ తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వెళుతున్నానని ఊహించి, అందుకు అనుగుణంగా ఆడాలని సూచించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఈ కొత్త టెక్నిక్‌ను అనుసరించడంతో, శ్రీలంకపై టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. అంతేగాక, మూడు వందలకుపైగా తేడాతో ఘన విజయాన్ని నమోదు చేయగలిగింది.

చిత్రం.. రవి శాస్ర్తీ