క్రీడాభూమి

చైనాలో నేమార్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, జూలై 31: బ్రెజిల్ ఫుట్‌బాల్ మెగాస్టార్ నేమార్ చైనాలో సందడి చేస్తున్నాడు. షాంఘై విమానాశ్రయానికి చేరుకున్న అతనికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యంత భారీ బందోబస్తు మధ్య అతనిని హోటల్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయం వెలుపల, అతను బస చేసే హోటల్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. నేమార్‌ను చూసేందుకు పోటీపడ్డారు. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ నుంచి రికార్డు స్థాయిలో 222 మిలియన్ యూరోలు (సుమారు 1,684 కోట్ల రూపాయలు) భారీ ధరతో పారిస్ సెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి)కి 25 ఏళ్ల నేమార్ వెళ్లనున్నాడు. పిఎస్‌జి జట్టుతో అతను చేరిన మరుక్షణం, సాకర్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టిస్తాడు. అయితే, ఈ ట్రాన్స్‌ఫర్‌పై నేమార్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఈ వార్తలను ధ్రువీకరించడంగానీ, ఖండించడంగానీ చేయడం లేదు. నిజంగానే బార్సిలోనా అతనిని వదులుకుంటుందా? పిఎస్‌జికి అంత భారీ మొత్తాన్ని చెల్లించే సత్తా ఉందా? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించడం లేదు. ఇలావుంటే, చైనా చేరుకున్న వెంటనే అతను తన ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘నీ హవో చైనా (హల్లో చైనా). నేను నేమార్ జూనియర్‌ని. ఇప్పుడే ఇక్కడ అడుగుపెట్టాను’ అన్న సందేశం పంపాడు. తన అభిమానులందరినీ ఆక్కున చేర్చుకోవాలని ఉందని ఆ సందేశంలో పేర్కొన్నాడు. చైనాలోని తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేమార్‌కు చైనాలో విపరీతమైన ఆదరణ లభించింది. చైనా సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రమోషన్ కోసం అతను షాంఘైకి వచ్చాడు.