క్రీడాభూమి

వనే్డల్లో ఆడినట్టే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 31: శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన తొలి బ్యాటింగ్‌ను వనే్డ ఇన్నింగ్స్‌తో పోల్చాడు. ఆ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 50 పరుగులు సాధించిన పాండ్య భారత స్కోరు వేగంగా 600 పరుగుల మైలురాయికి చేరుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ ఇన్నింగ్స్ గురించి అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిజానికి కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్నట్టు ఏ దశలోనూ అనుకోలేదని, వనే్డ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ ఆడినట్టే ఉండిందని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్‌కు చాలా త్వరగా అలవాటు పడాలని అన్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టగల సామర్థ్యం పాండ్యకు ఉందని మరో బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఇటీవలే వ్యాఖ్యానించాడు. దానిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, యువరాజ్ సింగ్ మారిది ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లను తాను ఊహించలేదని చెప్పాడు. మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన అనుభవం తనకు ఉందన్నాడు. నాలుగో బంతిని కూడా సిక్సర్‌గా మార్చాల్సిన అవసరం తనకు ఎదురుకాలేదని చెప్పాడు. ఒకవేళ పరిస్థితులు డిమాండ్ చేస్తే, ఆ ఫీట్‌కు కూడా తాను ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు.

చిత్రం.. హార్దిక్ పాండ్య