క్రీడాభూమి

ఫ్రాన్స్‌కు ఇంగ్లాండ్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిల్బర్‌గ, జూలై 31: మహిళల యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌పై ఇంగ్లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 1-0 తేడాతో విజయం సాధించి షాకిచ్చింది. జొడీ టేలర్ అద్భుతమైన గోల్ చేసి, ఫ్రాన్స్‌పై ఇంగ్లాండ్‌కు 43 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మొదటి విజయాన్ని అందించింది. ఈ టోర్నమెంట్‌లో జొడీకి ఇది ఐదో గోల్. కాగా, ఏడోసారి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఫ్రాన్స్‌కు చుక్కెదురైంది. రొటెర్‌డామ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో డెర్మార్క్ 2-1 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించింది. నదియా నదీం, తెరెసా నీల్సెన్ కీలక గోల్స్ చేసి డెర్మార్క్‌ను గెలిపించారు. ఈ జట్టు సెమీ ఫైనల్‌లో ఆస్ట్రియాను ఢీ కొంటుంది. టోర్నమెంట్‌లో కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, అద్భుత ప్రతిభ కనబరుస్తున్న ఆస్ట్రియా అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్‌పై 5-3 తేడాతో గెలిచింది. కాగా మరో సెమీ ఫైనల్ ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మధ్య జరుగుతుంది. నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్‌లో స్వీడన్‌పై 2-0 స్కోరుతో విజయం సాధించింది.

చిత్రం.. ఇంగ్లాండ్ ను గెలిపించన జొడీ టేలర్