క్రీడాభూమి

కోర్టు మెట్లెక్కిన రొనాల్డో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, జూలై 31: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. పన్ను ఎగవేత కేసులో అతను సోమవారం కోర్టుకు హాజరయ్యాడు. ఆదాయ వివరాలను పూర్తిగా వెల్లడించకుండా, 17.2 మిలియన్ డాలర్లు (సుమారు 117 కోట్ల రూపాయలు) మేరకు పన్ను ఎగవేశాడని అతనిపై అభియోగాలున్నాయి. 2010లో కొత్త పన్ను విధానం ప్రకారం చేయాల్సిన చెల్లింపులను రొనాల్డో ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టాడని ప్రాసిక్యూషన్ వాదన. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఒకటి, ఐర్లాండ్‌లో మరొకటి డొల్ల కంపెనీలను నెలకొల్పి, భారీగా పన్నును ఎగవేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆ రెండు దేశాల్లో పన్ను రేటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ కంపెనీలను ఫ్లోట్ చేసినట్టు తెలిపింది. 2011-2014 మధ్యకాలంలో రొనాల్డో తన ఆదాయాన్ని 11.5 మిలియన్ యూరోలు (సుమారు 86 కోట్ల రూపాయలు)గా చూపించాడని, నిజానికి అది 45 మిలియన్ యూరోలు (సుమారు 343 కోట్ల రూపాయలు) అని కోర్టుకు తెలిపింది. తప్పుడు లెక్కలతో ఆదాయపన్ను ఎగవేతకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ కేసులో చాలాకాలంగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకొని, గత్యంతరం లేని పరిస్థితుల్లో విచారణకు వచ్చిన రొనాల్డో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి పొరపాటు చేయలేదని స్పష్టం చేశాడు. పున్న ఎగవేత ఆలోచనే తనకు లేదన్నాడు. కేసు విచారణలో ఉన్నందున ఇంతకంటే ఏమీ మాట్లాడలేనని తెలిపాడు. కాగా, కోర్టు వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.