క్రీడాభూమి

టీమిండియాతో రెండో టెస్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 1: టీమిండియాతో రెండో టెస్టులో తలపడే శ్రీలంక జట్టులో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ లహిరు తిరిమానేకి చోటు లభించింది. గాయంతో బాధపడుతున్న అశీల గుణరత్నే స్థానంలో తిరిమానేని మంగళవారం జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో గత ఏడాది జూన్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన తిరిమానే అప్పటి నుంచి ఏడాదికి పైగా సాంప్రదాయ ఫార్మాట్‌కు (టెస్టు క్రికెట్‌కు) దూరంగా ఉన్నాడు. తిరిమానేతో పాటు ఎడమ చేతి వాటం స్పిన్నర్ లక్షన్ సందకన్‌కు కూడా శ్రీలంక జట్టులో చోటు కల్పించారని, వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న సీమర్ సురంగ లక్మల్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారని ‘ఇఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్ఫో’ వెల్లడించింది.

చిత్రం.. లహిరు తిరిమానే