క్రీడాభూమి

2024 ఒలింపిక్స్‌కు పారిస్ ఆతిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజెల్స్, ఆగస్టు 1: 2028 ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనుకుంటున్నట్లు లాస్ ఏంజెల్స్ ప్రకటించడంతో పారిస్ 2024 ఒలింపిక్స్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. కాగా, ఇప్పుడు కుదిరిన ఒప్పందం రెండు నగరాలకే కాక ఒలింపిక్ ఉద్యమానికి కూడా మేలు చేస్తుందని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ‘మరోసారి ఒలింపిక్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు రాబోతున్నాయని ప్రకటించడానికి గర్విస్తున్నాను’ అని లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టి నగరంలోని సబ్‌హబ్ సెంటర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాడు. ఒలింపిక్ ఉద్యమానికి గొప్ప నగరాల్లో ఒకటైన లాస్ ఏంజెల్స్‌కు 2028లో మరోసారి ఒలింపిక్స్‌ను తీసుకు రాబోతున్నాం అని ఆయన అన్నాడు. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ తర్వాత 2004లో జరగబోయే ఒలింపిక్స్ నిర్వహణకోసం పారిస్‌తో పాటుగా లాస్ ఏంజెల్స్ పోటీలో ఉంది. లిమాలో సెప్టెంబర్ 13న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) విజేతను ప్రకటించనుంది. అయితే లిమాలో జరిగే సమావేశంలో ఈ రెండు ఒలింపిక్స్ విజేతలను ప్రకటిస్తామని గత నెల ఐఓసి ప్రకటించినప్పటినుంచి లాస్ ఏంజెల్స్ 2024లో ఒలింపిక్స్ నిర్వహణ పోటీనుంచి తప్పుకుని బదులుగా 2028 ఒలింపిక్స్ నిర్వహణకే మొగ్గు చూవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పారిస్ మాత్రం 2024 ఒలింపిక్స్ నిర్వహణకోసమే మొదటినుంచి పట్టుబడుతోంది. 2024 ఒలింపిక్స్ నిర్వహణకోసం లాస్ ఏంజెల్స్ అధికారులు 5.3 మిలియన్ డాలర్ల ప్రతిపాదన కూడా చేశారు. అయితే ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి జరిపే వ్యయంపై ఐఓసితో ఒక ఒప్పందానికి వచ్చామని, దీనివల్ల అదనంగా మరో నాలుగేళ్ల సమయం లభిస్తుందని ఐఓసి అధికారులు చెప్తున్నారు. లాస్ ఏంజెల్స్‌కు ఐఓసి అనేక ఫీజులు, చెల్లింపులను మాఫీ చేశామని, దీనివల్ల లక్షలాది డాలర్లు ఆదా అవుతాయని బిడ్ చీఫ్ క్యాసే వాసర్‌మ్యాన్ అన్నాడు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా లాస్ ఏంజెల్స్‌కు ముందుగానే 18 కోట్ల డాలర్ల సొమ్ము ఇవ్వడానికి కూడా ఐఓసి అంగీకరించింది.