క్రీడాభూమి

స్టాన్‌ఫోర్డ్‌లో షరపోవా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెల్స్, ఆగస్టు 1: కాలిఫోర్నియాలో జరుగుతున్న స్టాన్‌ఫోర్డ్ ఓపెన్ డబ్ల్యుటిఎ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా ముద్దుగుమ్మ మరియా షరపోవా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న షరపోవా ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో 6-1, 4-6, 6-0 సెట్ల తేడాతో అమెరికా క్రీడాకారిణి జెన్నీఫర్ బ్రాడీని మట్టికరిపించి శుభారంభాన్ని అందుకుంది. కెరీర్‌లో ఐదు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన షరపోవా రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఏడోసీడ్ క్రీడాకారిణి లెసియా సురెంకోతో తలపడనుంది. తొలి రౌండ్‌లో సురెంకో 6-3, 6-3 తేడాతో స్పెయిన్‌కు చెందిన లారా అరువాబరెనాపై విజయం సాధించింది.